Breaking News

ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

-‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌-2025’కు హాజరుకావాలని ఆహ్వానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆహ్వానించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో జరప తలపెట్టిన ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున కోరారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ను దావోస్ సమ్మిట్ తరహాలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థల ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, వివిధ రంగాల నిపుణులు సదస్సుకు హాజరవుతున్నట్టు ముఖ్యమంత్రికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *