Breaking News

ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్ వీక్షించిన హోం మంత్రి అనిత‌, ఎంపీలు క‌లిశెట్టి అప్ప‌ల నాయుడు, ఎమ్.భ‌ర‌త్ కుమార్

వైజాగ్, నేటి పత్రిక ప్రజావార్త :
ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐ.డి.ఎఫ్.సి ఫస్ట్ బ్యాంక్ సిరీస్ లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య శ‌నివారం జ‌రిగిన మూడో వ‌న్డే మ్యాచ్ ను రాష్ట్ర హోం మినిస్ట‌ర్ వంగ‌ల‌పూడి అనిత‌, విజ‌య‌న‌గ‌రం ఎంపీ క‌లిశెట్టి అప్ప‌ల నాయుడు, విశాఖ‌ప‌ట్నం ఎంపీ ఎమ్.భ‌ర‌త్ కుమార్ , టిడిపి విశాఖ జిల్లా అధ్య‌క్షుడు గండి బాబ్జి వీక్షించారు. వీరికి ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివ‌నాథ్, సెక్ర‌ట‌రీ సానా స‌తీష్ బాబు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం వీరంతా క‌లిసి మ్యాచ్ ను తిల‌కించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏసీఏ కోశాధికారి దండ‌మూడి శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ బండారు న‌ర‌సింహారావు, బిసిసిఐ అపెక్స్‌ కౌన్సిల్‌లో భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ) ప్రతినిధి చాముండేశ్వరినాథ్ , స్టేడియం చైర్మ‌న్ ప్ర‌శాంత్ లతో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *