విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ఘనంగా సత్యభామ స్టూడియో షోరూమ్ ప్రారంభించబడింది. స్థానిక గురునానక్ కాలనీ నాలుగవ లైన్ లో శనివారం డిసెంబర్ 6 న సత్యభామ స్టూడియో షోరూమ్ గొప్పగా ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవ మహోత్సవం సత్యభామ స్టూడియో షోరూమ్ అధినేత అయిన తాడికొండ సింధూర చేతుల మీదుగా ప్రారంభించబడింది. ఈ సందర్భంగా సత్యభామ స్టూడియో షోరూమ్ అధినేత అయిన తాడికొండ సింధూర మీడియాతో మాట్లాడుతూ ఇది తమ మొదటి బ్రాంచ్ అని తమకు దుస్తుల వ్యాపారంలో 8 సంవత్సరాల అనుభవం కలదని అన్నారు. సత్యభామ స్టూడియో షోరూమ్ నందు ఉమెన్స్ వేర్ అందుబాటులో ఉందని తెలియజేశారు. తమ షోరూమ్ నందు మగువలకు కుర్తిస్, ఫ్రాక్స్, త్రీ పీస్ సెట్స్, టూ పీస్ సెట్స్, లెహంగాస్, పార్టీవేర్, గౌన్లు, టాప్స్ లభిస్తాయని అన్నారు. ప్రీమియం క్వాలిటీ ఉన్న దుస్తులను అతి తక్కువ ధరలకు అందరికీ అందించడమే తమ లక్ష్యమని తాడికొండ సింధూర తెలియజేశారు.
సత్యభామ స్టూడియో షోరూమ్ ప్రారంభోత్సవ సందర్భంగా కస్టమర్లకు ఆఫర్లను ప్రకటించడం జరిగింది. 1000 రూపాయలకు 3 కుర్తిస్, 5000 రూపాయల కొనుగోలుపై 1000 రూపాయల డ్రెస్ ఉచితం, 10000 రూపాయల కొనుగోలుపై 2000 రూపాయల డ్రెస్ ఉచితం, 20,000 రూపాయల కొనుగోలుపై 4000 రూపాయల డ్రెస్ ఉచితం అని తెలియజేశారు. ఈ యొక్క ఆఫర్లను కస్టమర్లు సకాలంలో వినియోగించుకొని అతి తక్కువ ధరలకు ప్రీమియం క్వాలిటీ ఉన్న దుస్తులను తమ సొంతం చేసుకోగలరని ఆశించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ వంశీ, సహస్ర, శిసిర, శేషు కుమార్, రామకృష్ణ, అవినాష్, పవన్ కళ్యాణ్, కిషోర్, మధుమతి, జయశ్రీ, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News