Breaking News

తెలుగు భాషా పరిరక్షణకు అందరూ కృషి చేయాలి…

-అత్తలూరి విజయ లక్ష్మి స్వర్ణోత్సవ సభలో తెలుగు మరియు సంస్కృత ఆకాడమీ చైర్మన్ ఆర్. డి. విల్సన్ @శరత్ చంద్ర

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు భాషా పరిరక్షణ కోసం అందరూ కృషి చెయ్యాలని ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ మరియు ఉషా గ్రూప్ ఆఫ్ మ్యాగజైన్స్ అధినేత, ఎడిటర్ ఆర్. డి. విల్సన్ ఉద్గోషించారు.
శనివారం హైదరాబాద్ చిక్కడపల్లి లోని త్యాగరాయ గాన సభ లో ప్రముఖ రచయిత్రి, రేడియో నాటికల ప్రయోక్త అత్తలూరి విజయ లక్ష్మి స్వర్ణోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధి గా పాల్గొని ఆయన ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన తన ఉపన్యాసం కొనసాగిస్తూ ఆంగ్ల భాషా వ్యామోహం లో పడి మాతృ భాషను మనం చంపుకుంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. మన ఇంట్లో పిల్లలకు మాతృ భాష మీద మమకారం పెంచడం లేదు అన్నారు. ఇంగ్లీష్ మీడియం చదువుల వల్ల భాష అంతరించ బోయ్యే శిలాజం గా మారిపోయింది అన్నారు. ఇప్పుడు మాతృ భాష పరిరక్షణ సమాజం బాధ్యత గా మారిపోయింది అన్నారు.ప్రతి ఇంట్లో తెలుగు పత్రిక లు ఉండాలి అన్నారు.పత్రిక లు మూసి వేయడం ద్వారా సాహిత్య సంక్షోభం జరిగింది అన్నారు. రేపటి తరానికి వారధి సాహిత్యమే అన్నారు. మానవ సంబంధాలను ఆవిష్కరణ చెయ్యడం లోనూ.. రేపటి ప్రపంచం ను విలువలతో కొనసాగించడం లోనూ సాహిత్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది అని అన్నారు. ఈ నేపథ్యంలో సాహితీ సంపద సృష్టించడం లో అగ్ర గామిగా వున్న అత్తాలూరి విజయ లక్ష్మి గారి కృషి అపురూపం అన్నారు. గత 50 ఏళ్లుగా ఆమె చేసిన సాహితీ సేవ కు మరింత గుర్తిoపు రావాలని అన్నారు. వందకు పైగా రేడియో నాటికలు, వందలాది కథలూ నవలలు రాయడం మాములు విషయం కాదు అన్నారు. మారుతున్న సమాజ పోకడలు గురించి ఎప్పటికప్పుడు ఆమె అప్రమత్తం చేస్తూనే వున్నారు అన్నారు.
తెలుగు మరియు సంస్కృత ఆకాడమీ ద్వారా సాహిత్యం మరియు వైజ్ఞానికి అంశాలు మేళవిస్తూ ఒక మాస పత్రికను తీసుకొని రానున్నాం అన్నారు. జాతీయ సమగ్రతను పెంపొందించడానికి సంస్కృత భాష ఉపయోగపడుతుందని అన్నారు. పూర్వికు ల సాహిత్యం బద్ర పరచడానికి మళ్ళీ ముద్రణ చేస్తున్నాం అన్నారు. ఈ వరస లో శ్రీ శ్రీ, తిలక్, చలం, కృష్ణ శాస్త్రి, చాసో వంటి పుస్తకాలు తగు రాయల్టీ వారి కుటుంబం కి ఇచ్చి ముద్రిస్తాం అన్నారు. అదే విధంగా డిజిటల్ పర్మేట్ లో కూడా సాహిత్యం నిక్షిప్తం చేస్తాo అన్నారు. సంస్కృతంలోని పలు గ్రంథాలను తిరిగి ముద్రిస్తాం అన్నారు. సభకు దూరదర్శన్ పూర్వ అధికారి ఓలేటి పార్వతిశం అధ్యక్షత వహించారు. సభ లో మాజీ ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ సంచాలకులు డి. విజయ భాస్కర్,వంశీ సంస్థ అధ్యక్షులు రామరాజు,సినీ దర్శకులు వి. ఎన్ ఆదిత్య,తానా(అమెరికా ) అంతర్జాల కార్యక్రమాల ప్రయోక్త తోటకూరి ప్రసాద్, రాంకీ ఫౌండేషన్ అధినేత రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.అంతకు ముందు మొత్తం మహిళా కళా కారులతో “మహారాణి “అనే నాటిక ప్రదర్శించారు.శ్రీజా దర్శకత్వం లో ప్రముఖ రచయిత్రి సరస్వతి కరవది, సర్వ మంగళ గౌరి, సుందరీ నాగమణి తదితరులు నాటకాన్ని రక్తి కట్టించారు. సోషల్ మీడియా పోకడలు ఈ నాటికలో వ్యoగ్యంగా. హాస్యం రంగరించి ప్రదర్శించారు.
సాహితీ సామ్రాగ్ని
50 ఏళ్లుగా అత్తాలూరి విజయలక్ష్మి సాహితీ లోకం చేస్తున్న కృషి కి గుర్తింపు గా సాహితీ సామ్రాగ్ని అనే బిరుదును వంశీ సంస్థ ప్రకటించింది.
కాగా అత్తాలూరి అనసూయ, కామకోటి రాఘవ రావు స్మారక పురస్కారాలు కళ్యాణి, మల్లాది రమణ కి ఇవ్వడం జరిగింది. సభలో లేఖిని సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *