-ఫల, పుష్ప ప్రదర్శన ను సందర్శించిన ఎంపి సతీమణి కేశినేని జానకి లక్ష్మీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడ నగరపాలక సంస్థ, అర్బన్ గ్రీనరీ, ఉద్యానవన శాఖ సహకారంతో పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డులోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఫల, పుష్ప ప్రదర్శన-2025 ను విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మీ ఆదివారం సందర్శించారు . కేశినేని జానకి లక్ష్మి కు సంస్థ నిర్వాహకులు స్వాగతం పలికారు.
అలాగే ఈ ప్రదర్శనల శాలలో నిర్వహించిన గ్రాండ్ పెరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ ఫ్యాషన్ షోను ఆసక్తిగా తిలకించారు. నేచురల్ ఫార్మింగ్ పద్దతిలో పండించిన పూలు, పండ్లు, కూరగాయల స్టాల్స్ ను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రదర్శన శాలలో అందుబాటులో వున్న దేశీయ, అంతర్జాతీయ పూలమొక్కలు, పలు రకాల పండ్ల మొక్కలు, గార్డెన్ అలంకరణ వస్తువులు,, ఆర్గానిక్ ఎరువులు, ఆర్గానిక్ ఆహార పదార్థాలు గురించి రోజ్ సొసై టీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సభ్యులు జానకి లక్ష్మికి వివరించారు.
అనంతరం కేశినేని జానకి లక్ష్మీ మాట్లాడుతూ. సమాజంలో మొక్కలు పెంచాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. కాలుష్య నియంత్రణ ఒక చెట్ల పెంపకంతోనే సాధ్యమన్నారు. విద్యార్ధులకి చిన్నతనం నుంచే నేచురల్ ఫార్మింగ్ పై అవగాహన కల్పించాలని సూచించారు. రోజ్ సోసైటీ కి తన సహకారం ఎప్పుడు వుంటుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి, రోజ్ సోసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు ఎస్.ఉషారాణి సెక్రటరీ జి.లక్ష్మీ, ఇన్చార్జ్ పద్మప్రియ, మీడియా కో-ఆర్డినేటర్ అబ్బూరి రత్న లక్ష్మీ, రోజ్ కమిటీ సభ్యులు అట్లూరి సుమ, లక్ష్మీ తులసీ, సీతామహాలక్ష్మీ, ఉమా, ఛాయ, శుభ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News