-ఎలైట్ క్రికెట్ లీగ్ జెర్సీ, పోస్టర్ ఆవిష్కరణ చేసిన రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
చామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎలైట్ క్రికెట్ లీగ్ నిర్వహణలో భాగంగా జెర్సీ & పోస్టర్‌ను మంగళగిరి లోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఘనంగా ఆవిష్కరించారు. విశాఖపట్నం లోని ACA–VDCA క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ లీగ్‌ను రాష్ట్రంలో క్రీడా అభివృద్ధికి మైలురాయిగా మంత్రి అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నదని, యువతకు క్రికెట్ సహా అన్ని క్రీడా రంగాల్లో అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎలైట్ క్రికెట్ లీగ్ రాష్ట్ర యువ క్రీడాకారులకు మంచిప్లాట్‌ఫారంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ECL చైర్మన్ , ఫౌండర్ చామల ఉదయ్ చంద్రరెడ్డి, వైస్ చైర్మన్ చామల భాను చంద్ర రెడ్డి, కో ఫౌండర్ & డైరెక్టర్ M.రవీంద్ర రెడ్డి, M.సుధీర్, E.విజయ్ రెడ్డి, శివారెడ్డి, నరేష్ రెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News