గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి వార్డ్ సచివాలయం పరిధిలో అపార్ట్మెంట్లు, గ్రూప్ హౌస్ ల్లో పర్యావరణహితంగా క్లస్టర్ కంపోస్ట్ యూనిట్స్ ఏర్పాటుకు ప్రజారోగ్య అధికారులు, కార్యదర్శులు భాధ్యత తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం ఇన్నర్ రింగ్ రోడ్, రెడ్డిపాలెం, మధురా నగర్, స్తంభాలగరువు ప్రాంతాల్లో పర్యటించి, పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇళ్లల్లో వచ్చే వ్యర్ధాలతో ఎరువు తయారు చేసేలా ప్రతి సచివాలయం పరిధిలో ప్రజలకు హోం, క్లస్టర్ కంపోస్ట్ పై ప్రజారోగ్య అధికారులు అవగాహన కల్గించాలని, అవసరమైతే ఐటిసి వారి సహకారం తీసుకోవాలన్నారు. ఈ నెలాఖరు నాటికి ప్రతి సచివాలయం పరిధిలో కనీసం 50 ఇళ్లల్లో హోం కంపోస్ట్, 10 అపార్ట్మెంట్లలో క్లస్టర్ కంపోస్ట్ యూనిట్స్ ఏర్పాటుకు శ్రద్ధ తీసుకోవాలన్నారు. హోం, క్లస్టర్ కంపోస్ట్ ల ద్వారా వచ్చిన ఎరువుని వారు తమ పరిసరాల్లో మొక్కలకు వినియోగించుకొన్నాక మిగిలితే దానికి జిఎంసి కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించి, శివారు ప్రాంతాల్లో రోజువారీ చెత్త సేకరణపై ఫిర్యాదులు అందుతున్నాయని, పుష్ కాట్ లు లేదా ఈ-ఆటోల ద్వారా ఎప్పటికప్పుడు చెత్త సేకరణ చేయాలన్నారు. ఖాళీ స్థల యజమానులను గుర్తించి, శుభ్రం చేసుకోవాలని నోటీసులు జారీ చేయాలన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ నుండి నూతన నిర్మాణం చేస్తున్నరెడ్డిపాలెం మెయిన్ రోడ్ పరిశీలించి, విద్యుత్ స్తంభాలు వెంటనే షిఫ్ట్ చేయాలని, రోడ్ పక్కన లో లెవల్ లేకుండా మెరక చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పిజిఆర్ఎస్ ద్వారా తమ సమస్యలపై ఫిర్యాదు చేసిన ప్రకాష్ నగర్ ప్రాంతాన్ని పరిశీలించి, రాకపోకలకు వీలుగా వెట్ మిక్స్ రోడ్ ని నిర్మాణం చేయలని డిఈఈని ఆదేశించారు. స్థంబాలగరువులో డ్రైన్లు శుభ్రంగా లేక పోవడంపై ప్రజారోగ్య అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి, ప్రతి రోజు మధ్యాహ్నం డ్రైన్ల శుభ్రంపై కార్మికులకు విధులు కేటాయించాలని, ఎస్ఎస్ ల వారీగా కేటాయించిన గ్రాస్ కటింగ్ మెషిన్ల ద్వారా డ్రైన్, రోడ్ల వెంబడి గడ్డి, పిచ్చి మొక్కలను తొలగించాలని ఆదేశించారు.
పర్యటనలో డిఈఈ రమేష్ బాబు, ఎస్ఎస్ ఐజాక్, ఇంజినీరింగ్, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News