గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో స్ట్రీట్ లైటింగ్ ఏర్పాటు పనులు వారంలోగా పూర్తి చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కౌన్సిల్ సమావేశ మందిరంలో ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది మరియు సచివాలయాల కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన చర్యల పై తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని ప్రాంతాలలో స్ట్రీట్ లైట్లు వెలగాలని, ఏర్పాటు చేసిన అన్ని పోల్స్ కు లైట్లు ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన సామగ్రిని వెంటనే తీసుకొని యుద్దప్రాతిపదికన పనులు ప్రారంభించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా స్ట్రీట్ లైట్లు అవసరమైన ప్రాంతాలను గుర్తించి, వీధి దీపాల ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాల్ సెంటర్, పి.జీ.ఆర్.యస్ లకు వీధి దీపాల పై అందే పిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. నగరంలో పలు డివిజన్లలో అవసరమైన ప్రాంతాలలో అభివృద్ధి పనులు నిర్వహించుటకు అనుమతులు మంజూరు చేయుట జరిగిందని, సదరు అభివృద్ధి పనులు నిర్వహించుటకు కాంట్రాక్టు తీసుకున్న కాంట్రాక్టర్లు నిర్దేశిత సమయంలోపు, నాణ్యతాప్రమాలతో పనులు పూర్తి చేసేల ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే నగరంలో త్రాగు నీటి సమస్యలు తలెత్తకుండా, త్రాగు నీటి సరఫరా జరుగు సమయంలో అధికారులు క్లోరిన్ పరీక్షలు నిర్వహించి, ఫీల్డ్ విజిట్ లు చేయాలని, ఎక్కడైనా త్రాగు నీటి సరఫరాలో సమస్యలుంటే, వెంటనే సదరు సమస్యలను పరిష్కరించుటకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సమావేశంలో ఇంచార్జ్ యస్.ఈ సుందర్రామి రెడ్డి, ఈ.ఈలు వేణు, కోటేశ్వర రావు, మేనేజర్ బాలాజీ బాష, డి.ఈ.ఈ లు, ఏ.ఈ లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News