అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఏపీ సిఆర్డీఏ) పరిధిలో భూ సమీకరణ పథకంలో ఏపీ సిఆర్డీఏ వారికి 9.14 కింద ఇటీవల భూములు అందజేసిన పలు గ్రామాల రైతులకు, అలాగే N17 రహదారి నిర్మాణం కారణంగా ప్రభావితమైన అనంతవరం మినహాయింపు భూమికి సంబంధించిన 24 మంది రైతులకు, మల్కాపురం – సర్వే నంబర్ 18లో మినహాయింపు భూమి వలన ప్రభావితమైన ఇద్దరికి, మల్కాపురం – అనధికార లేఅవుట్ వలన ప్రభావితమై 65%–35% కింద ఉన్న ఏడుగురు రైతులకు ఈ – లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించడం జరుగుతుంది.
కృష్ణాయపాలెం, నవులూరు 1& 2, కురగల్లు 1& 2, వెలగపూడి, మందడం 1& 2, నిడమర్రు 1& 2 గ్రామాల రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించేందుకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, అలాగే పెనుమాక, తుళ్లూరు 1& 2, నెక్కల్లు, అనంతవరం, రాయపూడి 1& 2, వెంకటపాలెం, దొండపాడు, ఐనవోలు, లింగాయపాలెం, ఉద్ధండరాయునిపాలెం గ్రామాల రైతులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు, అనంతవరం, మల్కాపురం గ్రామాలకు సంబంధించిన ప్రత్యామ్నాయ ప్లాట్లకు 4 గంటల నుంచి 5 గంటల వరకు రాయపూడిలోని ఏపీ సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ఈ – లాటరీ జరుగుతుంది. ఈ – లాటరీలో భాగంగా 225 మంది రైతులకు మొత్తంగా 405 ప్లాట్లను ఆన్‌లైన్ ర్యాండమ్ సిస్టమ్ ద్వారా కేటాయించడం జరుగుతుంది. వీటిలో 264 ప్లాట్లు 9.14 కింద భూములు అందజేసిన రైతులకు కేటాయించబడతాయి, మిగిలిన 108 ప్లాట్లు ప్రత్యామ్నాయ ప్లాట్లు. సంబంధిత రైతులు ఈ- లాటరీ కార్యక్రమానికి హాజరై సంబంధిత ప్రొవిజనల్ సర్టిఫికెట్లను తీసుకోవాలని కోరుతున్నాము.
Prajavartha Online Telugu News