Breaking News

నగర పరిధిలో 64 ఈ -వేస్ట్ కేంద్రాలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఈ -వేస్ట్ సేకరణ కేంద్రాలను ప్రతి వార్డులో ఏర్పాటు చేయాలని కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని తమ చాంబర్లో శాఖాధిపతిలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగరంలో ప్రస్తుతం ఉన్న ఈ- వేస్ట్ కేంద్రాల స్థితిగతులను సమీక్షించారు, ఈ -వేస్ట్ సేకరణ కేంద్రాలు ప్రతి వార్డులో ఏర్పాటు చేయాలని, ప్రజలకు వాటిపై విస్తృతమైన అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఈ- వేస్ట్ కేంద్రాలకు వచ్చి తమ ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను అందించేలా అవగాహన కార్యక్రమాలు ప్రత్యేక డ్రైవ్ ద్వారా చేపట్టాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ డి. చంద్రశేఖర్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్నకుమార్, చీఫ్ ఇంజనీర్ ఇంచార్జ్ పి.సత్యకుమారి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ బాబు శ్రీనివాసన్, డాక్టర్ గోపాల నాయక్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *