-ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి కి బయలు దేరిన 4వ బ్యాచ్
-ఎన్టీఆర్ జిల్లా ఎస్.హెచ్.జి మహిళ లు 35 మందితో హైదరాబాద్ ఎన్. ఐ. ఆర్. డి. కి బయలుదేరిన బస్సు
-జెండా ఊపి బస్సు ప్రారంభించిన నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
-ఎన్.ఐ.ఆర్.డి లో కేశినేని ఫౌండేషన్ , ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజుల శిక్షణ
-బ్రిక్స్ తయారీ పై శిక్షణ పొందనున్న 35 మంది ఎస్.హెచ్.జి మహిళ లు
నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :
నందిగామ పట్టణం కాకాని నగర్ నందు బుధవారం కేశినేని ఫౌండేషన్ మరియు NIRD (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్) సంయుక్త ఆధ్వర్యంలో బ్రిక్స్ తయారీ విధానంపై నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమానికి వెళ్లే మహిళల బస్సును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య జెండా ఊపి ప్రారంభించారు.
ఈ శిక్షణ కార్యక్రమం ఈ నెల 18 నుండి 20వ తేదీ వరకు హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని NIRD PR ప్రధాన కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు మాట్లాడుతూ, మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ఇటువంటి నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ఎంతో దోహదపడతాయన్నారు. బ్రిక్స్ తయారీ వంటి ఉపాధి అవకాశాలు గ్రామీణ మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గంగా మారుతాయని పేర్కొన్నారు.
కేశినేని ఫౌండేషన్ సహకారంతో మహిళలకు శిక్షణ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తుండటం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వం మహిళల సంక్షేమం, ఉపాధి కల్పనకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి, నందిగామ టౌన్ పార్టీ ప్రెసిడెంట్ ఏచూరి రాము గారు, ఎన్టీఆర్ జిల్లా రూరల్ మహిళ సమైక్య అధ్యక్షురాలు కందులకల్పన గారు, జిల్లా ఎన్.ఐ.ఆర్.డి అర్బన్ కో-ఆర్డినేటర్ వల్లభనేని నరసింహాచౌదరి గారు, ఎన్.ఐ.ఆర్.డి రూరల్ కో-ఆర్డినేటర్ సొంగా సంజయ్ వర్మ లతో పాటు డ్వాక్రా సంఘ ప్రతినిధులు, ఎన్డీయే కూటమి నాయకులు, ఎన్.ఐ.ఆర్.డి అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News