Breaking News

2029 కల్లా అందరికీ అ..ఆ..లు

-అక్షర ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యం
-ఈ ఏడాది 25 లక్షల మందికి అక్షరాస్యత

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
అ…అక్షర…ఆ…ఆంధ్రప్రదేశ్ పేరిట 2029 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రం సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మానవ వనరుల అభివ్రుద్ధి శాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 72.6 శాతం అక్షరాస్యత ఉందని చెప్పారు. రాష్ట్రంలో 81 లక్షల మంది నిరక్షరాస్యులున్నారని వారందర్నీ వచ్చే మూడేళ్లలో అక్షరాస్యులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ ఏడాది 25 లక్షల మందిని అక్షరాస్యలుగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. జిల్లాలో కలెక్టర్లు అక్షరాస్యత కార్యక్రమం విజయవంతంగా నిర్వహేంచేలా చర్యలు చేపట్టాలని కోరారు. స్వయం సహాయక సంఘాల్లో చదువుకున్నవాళ్లను గుర్తించి వారితో ఆయా ప్రాంతాల్లో అక్షరాస్యత కార్యక్రమం వాలంటీర్లుగా వినియోగించుకోవాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *