Breaking News

పోషకాహార మిషన్ స్కీము క్రింద చిరుధాన్యాల ఉత్పత్తి పై శిక్షణా కార్యక్రమము

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ రోజు ఎన్ టి ఆర్ జిల్లా వ్యవసాయ అధికారి డి యమ్ ఎఫ్ విజయ కుమారి అధ్యక్షతన వ్యవసాయశాఖ అధికారులు మరియు క్షేత్ర స్థాయి వ్యవసాయ సహాయకులకు జాతీయ ఆహార భద్రత మరియు పోషకాహార మిషన్ స్కీము క్రింద చిరుధాన్యాల ఉత్పత్తి అన్న అంశముపై జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర జల వనరుల నిర్వహణ & రైతు శిక్షణా కేంద్రం, విజయవాడలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమమునకు డా॥ బి వెంకటేశ్వర్లు, ప్రధాన శాస్త్రవేత్ మరియు హెడ్ ( పూర్తి అదనపు బాధ్యత) వ్యవసాయ పరిశోధనా స్థానము, గరికపాడు మరియు డా॥ ఎమ్. రవి కిషోర్, హెడ్ మరియు ప్రోగ్రామ్ కో ఆర్జినేటర్, కృషి విజ్ఞాన కేంద్రము, గరికపాడు, డా॥ పి యన్ శివ ప్రసాద్, సబ్జెక్ట్ మాటర్ స్పెషలిస్ట్ (సేద్య విభాగం), కృషి విజ్ఞాన కేంద్రము, గరికపాడు, మరియు డా॥ ఆర్. ప్రభావతి , గృహ విజ్ఞాన శాస్త్రవేత్త , కృషి విజ్ఞాన కేంద్రము, గరికపాడు పాల్గొన్నారు. వారు తక్కువ నీరు అవసరం కలిగిన పొడి భూములకు అనుకూలం అయిన మరియు వివిధ పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా అధిక స్థితిస్థాపకత కలిగినటువంటి ఆకస్మిక వాతావరణ మార్పులకు అనువైన పురాతన కాలం నాటి సాంప్రదాయ పంటలు మరియు జాతి ఆహారాలైన ప్రత్యేక పోషక లక్షణాలు – అధిక ఫైబర్, నాణ్యమైన ప్రోటీన్ & ఖనిజాలు సమృద్ధిగా కల్గిన చిరుధాన్యాల ప్రోత్సహించ వలసిన ఆవశ్యకతను వివరించడంతో పాటు చిరుధాన్యాల సమగ్ర యాజమాన్యం గురించి అవగాహన కల్పించడం జరిగింది. వ్యవసాయశాఖ నుండి టి మాధవీలత, ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ డైరక్టర్ (ఆత్మ), డి. వెంకటేశ్వర్లు, డిస్ట్రిక్ట్ ట్రెయినింగ్ కో ఆర్జినేటర్, జిల్లా వనరుల కేంద్రము, విజయవాడ మరియు వై. శంకర్ నాయక్, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్, ( ఎపి సి యన్ ఎఫ్) వారు కూడా పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *