Breaking News

దోమల సమస్యను నిర్మూలించేందుకు విస్తృత చర్యలు చేపట్టాలి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దోమల సమస్యను నిర్మూలించేందుకు విస్తృత చర్యలు చేపట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఈట్ స్ట్రీట్, ఎంజీ రోడ్, డివి మేనర్ రోడ్, లబ్బీపేట ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో దోమల సమస్యను నిర్మూలించాలని, అందుకు అనుగుణంగా విస్తృతమైన చర్యలు చేపట్టాలని ఆంటీ లార్వే ఆపరేషన్లు ప్రతినిత్యం జరుగుతుండాలని, ప్రతి ఫ్రైడే ఖచ్చితంగా డ్రై డే కార్యక్రమాలు ప్రతి వార్డ్ లో నిర్వహించి ప్రజలకు వారి ఇంట్లో ఉన్న నీటి నిల్వలను లేకుండా ప్రతి వారం చూసుకునేటట్టు అవగాహన కల్పించాలని, ఎప్పటికప్పుడు సైడ్ డ్రైన్లు శుభ్రపరుస్తూ నగరంలో నీటి నిల్వలు ఎక్కడా లేకుండా చూసుకోవాలని తద్వారా దోమల ఉత్పత్తికి ఎటువంటి ఆస్కారం ఉండదని. ఖాళీ స్థలాలలో నీరు నిల్వ లేకుండా సంబంధించిన యజమానులకు నోటీసులు పంపించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని, నగరంలో దోమల సమస్యలను పరిష్కరించాలని, ప్రజల ఆరోగ్యమే ప్రధమ ధ్యేయంగా ప్రతి ఒక్కరు పని చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కే. అర్జునరావు, చీఫ్ సిటీ ప్లానర్ కే. సంజయ్ రత్నకుమార్, చీఫ్ ఇంజనీర్ ఇంచార్జ్ పి.సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాల నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *