-మీడియా మిత్రులకు రోడ్డు భద్రతలో భాగంగా హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేసిన పోలీసు శాఖ : జిల్లా ఎస్.పి సుబ్బరాయుడు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాత్రిపూట, మద్యం తాగి వాహనాలు నడిపి ప్రాణాలు కోల్పోవద్దు అని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ .. రోడ్డుమీద చూస్తే చాలామంది హెల్మెట్లు లేకుండా ప్రయాణిస్తున్నారని అన్నారు. ఒకటిన్నర కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ బెంగళూరు వంటి మహానగరాలలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న వారు తప్పకుండా హెల్మెట్లు ధరిస్తున్నారని డబల్ రైడ్ చేసేవాళ్ళు కూడా ఇద్దరు హెల్మెట్ ధరిస్తున్నారని అన్నారు. మహా నగరాలతో పోల్చుకుంటే మన జనాభా ఐదు నుంచి ఆరు లక్షల ఉంటుందని అయినా కూడా మనం హెల్మెట్లు ధరించడం లేదని అన్నారు. ఓవర్ స్పీడు, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ లోడ్ ద్వారా ఎక్కువ ప్రమాదాలు సంభవిస్తున్నాయని అన్నారు. చాలామంది బయట ప్రాంతాల నుంచి సిక్స్ సీటర్స్ సెవెన్ సీటర్స్ వెహికల్స్ లో వస్తున్నప్పుడు ఓన్ గా డ్రైవింగ్ చేస్తుండడం, నిరంతరంగా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని ముఖ్యంగా ప్రాణాలు పోతున్నాయని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తిరుపతి జిల్లాలో నేషనల్ హైవే స్ అధికంగా ఉండడంతో తరచూ యాత్రికులు ఎక్కువగా వస్తుండడంతో ఇక్కడ ప్రమాదాలు అధికంగా శాంభవిస్తున్నాయని కార్లలో వచ్చేవారు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని. రాత్రిపూట 11 దాటితే అసలు డ్రైవింగ్ చేయరాదని అన్నారు. మద్యం తాగి అసలు డ్రైవింగ్ చేయరాదని అన్నారు.
జిల్లా ఎస్. పి మాట్లాడుతూ.. అందరికీ కుటుంబాలు ఉంటాయని కనుక డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. మీడియా మిత్రులకు పోలీస్ శాఖ వారి తరఫున హెల్మెట్లు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందిస్తున్నామని, మీరు మీడియా హెల్మెట్ వాడకం మరియు రోడ్డు ప్రమాదాల భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.
Prajavartha Online Telugu News