Breaking News

క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న పోతిన వెంకట మహేష్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్రిస్టమస్ పర్వదినం సందర్భంగా ఫిల్ డెల్ఫియా చర్చిలో పాస్టర్ చార్లెస్ పి జాకబ్ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న పోతిన వెంకట మహేష్ మరియు టీం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చార్లెస్ పీజాకబ్ మాట్లాడుతూ మనకు ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్న దానికి ఒక పరిమితి ఉంటుంది ఆ పరిమితిలోకి భగవంతుని ఆహ్వానించినప్పుడే మనం అద్భుతాలు సృష్టించగలుగుతామన్నారు. సంబంధాలను సులువుగా వదులుకోవద్దన్నారు. పోతిన మహేష్ మాట్లాడుతూ  ఒక సంవత్సరానికి కావలసినటువంటి శక్తిని క్రిస్టమస్ రోజున ఈ ప్రార్థన మందిరం నుంచి పొందగలుగుతున్నామన్నారు. నిజమైన స్నేహానికి నిర్వచనం చార్లెస్ అని అన్నారు. దేని పట్ల వ్యామోహం లేదు భగవంతుడు ఆశీస్సులతో ప్రజా శ్రేయస్సుకై పని చేస్తామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *