Breaking News

కాకాని వెంకటరత్నం 53వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం 53వ వర్ధంతి సందర్భంగా మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరావు ముఖ్యఅతిథిగా పాల్గొని విజయవాడలోనీ బెంజ్ సర్కిల్ వద్ద గల కాకాని వెంకటరత్నం విగ్రహానికి పూలమాలవేసి కాకాని ఆశయ సాధన సమితి అధ్యక్షులు డాక్టర్ కాకాని తరుణ్ ఘన నివాళులర్పించారు. అనంతరం మాజీ మంత్రి వసంత నాగేశ్వరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఆనాటి జై ఆంధ్ర ఉద్యమంలో కాకాని వెంకటరత్నం పోషించిన పాత్ర ,దేశంలోనే ఒక మైలురాయిగా నిలిచిందని , ఆ ఉద్యమంతోనే ఆంధ్ర రాష్ట్రంలో వీర కాకానిగా పిలవబడుతున్న కాకాని వెంకటరత్నంకు వారి ఆధ్వర్యంలోనే వీరవసంత అనే బిరుదు రావడం ఎంతో సంతోషకరమన్నారు. నేటి రాజకీయ నాయకులకు కాకాని వెంకటరత్నం జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమని పిలుపునిచ్చారు. నివాళులర్పించిన అనంతరం పేద ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు. కాకాని ఆశయ సాధన సమితి అధ్యక్షులు డాక్టర్ కాకాని తరుణ్ మాట్లాడుతూ… 2018 ప్రభుత్వ హయాంలో నాటి నాయకులు బెంజ్ సర్కిల్ నందు గల కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని తొలగించి, తదుపరి చర్యంగా కృష్ణా నది తీరాన కాకాని వెంకటరత్నం స్మారకవనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిసారించి కృష్ణానది తీరాన స్మృతివనం ఏర్పాటు చేయాలని అప్పుడే మన స్వతంత్ర సమరయోధులకు మనం ఇచ్చే నిజమైన గౌరవ పురస్కారమని మీడియా సమావేశంలో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ చైల్డ్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ ఏవీ సూర్యనారాయణరాజు, మరియు బిజెపి కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు, ఎంజి రంగా ట్రస్ట్ చైర్మన్ గోగినేని ధనశేఖర్ మరియు ప్రముఖ ఎన్నారై అక్కినేని ఆనంద్ , సుధా, వేమూరి నాగేశ్వరరావు, ప్రముఖ హైకోర్టు న్యాయవాది ముళ్లపూడి సత్యనారాయణ, ఆకునూరు స్వగ్రామం నందుగల కాకాని కుటుంబ సభ్యులు మరియు అభిమానులు …ప్రముఖ ఐపిఎల్ క్రికెటర్, స్టార్ మా కామెంటరీ దొడ్డపునేని కళ్యాణ్ కృష్ణ మరియు మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి ప్రముఖ స్వతంత్ర సమరయోధుల అసోసియేషన్ కార్యదర్శి మోతుకురి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *