-పి.బి.సిద్ధార్థ ఎంబిఎ విద్యార్థులకి నైపుణ్యపాఠాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అవకాశాలైనా, ఫలితాలైనా ప్రతిభతోనే రాబట్టాలని జె.ఎస్.డబ్ల్యు. ఫౌండేషన్ (ముంబయి) సీఈఓ పవిత్రకుమార్ అన్నారు. పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పీజీ విభాగం (ఎం.బి.ఎ.) శుక్రవారం వెబినార్ హాలులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తాను సిద్ధార్థ పూర్వ విద్యార్థినని, టాటా ట్రస్టులో చీఫ్ ప్రోగ్రాం డైరెక్టర్ గా తాను చేశానని, కార్పొరేట్ నుంచి సేవారంగంలోకి తన పయనం సాగిందన్నారు. ఎవరైనా జీవితంలో రాణించాలంటే తమను తాము నిరూపించుకోవాలన్నారు. సవాళ్లను స్వీకరించాలన్నారు. శ్రమపడే తత్వంతో సమష్టిగా లక్ష్యాలు ఛేదించాలని పిలుపునిచ్చారు. టాటా సన్స్ నుంచి టాటా ట్రస్టుకు డివిడెండ్ వచ్చేదని టాటా ట్రస్ట్ పక్షాన నీతి ఆయోగ్, గూగుల్ లలో తాను పనిచేశానని తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా పి.పవిత్రకుమార్ ను కళాశాల ప్రిన్సిపల్ డా. మేకా రమేశ్, డీన్ ఆచార్య రాజేశ్ సి.జంపాల, డా . ఎం.డి.ఎస్ రహమాన్ సత్కరించారు.
Prajavartha Online Telugu News