-యువత సద్వినియోగం చేసుకోవాలి..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను 104 మొబైల్ మెడికల్ యూనిట్లు (MMUs) లో ఉన్నటువంటి ఖాళీలకు ఇంటర్వూస్ ది.27.12.2025 మరియు ది. 28.12.2025 అనగా శనివారం మరియు ఆదివారం ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 04:00 గంటల వరకు మన విజయవాడ లోని మార్కెట్ యార్డ్, గొల్లపూడి (Gollapudi), విజయవాడ నందు నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సి. మధుభూషణ్ రావు మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు సంయుక్తంగా తెలియజేసారు.
ఈ 104 మొబైల్ మెడికల్ యూనిట్లు (MMUs) లో ఉన్నటువంటి ఖాళీలకి సంబందించి అనగా డ్రైవర్లు (డ్రైవర్స్) మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్లు (DEOs) కు ఇంటర్వూస్ నిర్వహించడం జరుగుతుంది. ఎక్కువగా ఈ ఖాళీలకు అనుభవం ఉన్న వారికీ ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. డ్రైవర్ ఖాళీలకు సంబంధించి పదోవ తరగతి చదువుకోని అలాగే చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండవలెను, వీరికి నెలకు జీతం Rs. 16,000/- ఉంటుందని అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఖాళీలకు సంబంధించి డిగ్రీ, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండవలేనని, వీరికి నెలకు జీతం Rs. 15,000/- ఉంటుందని తెలియజేసారు. ఈ ఖాళీలకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ మరియు డ్రైవింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయబడును అని తెలియజేసారు.
అభ్యర్థులు వొచ్చేటపుడు Resume తో లేదా Bio Data Form తో పాటు ఆధార్, PAN కార్డ్ కాపీ మరియు సర్టిఫికెట్లతో రావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 75870 16988 నంబర్ ను సంప్రదించాలని తెలిపారు.
Prajavartha Online Telugu News