విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో సైక్ సిద్ధార్థ్ చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్రం ప్రమోషన్ లో భాగంగా భవానిపురం లోని బాక్స్ 22 క్రికెట్ ప్రాంగణంకు చిత్ర యూనిట్ విచ్చేసి సరదాగా హీరో హీరోయిన్ క్రికెట్ ఆడారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో శ్రీ నందు మాట్లాడుతూ తాను నిర్మాతగా తొలిసారి సైక్ సిద్ధార్థ్ చిత్రాన్ని నిర్మించడం జరిగిందని చెప్పారు. ఈ చిత్రంలో తాను సిద్ధార్థ్ క్యారెక్టర్ లో ప్రేక్షకులను అలరించనున్నట్లు తెలియజేశారు. విజయవాడ నగరం నుంచి తన చిత్ర ప్రమోషన్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. తాను విజయవాడ వాసినీ అని సినిమాపై ఆసక్తితో హైదరాబాద్ కు వెళ్లడం జరిగిందన్నారు. సైక్ సిద్ధార్థ్ చిత్రం పూర్తిగా ప్రేమ బ్రేకప్ నేపథ్యంలో సాగుతుందన్నారు. బ్రేకప్ జరిగిన విషయాన్ని హాస్య భరితంగా ప్రేక్షకులకు చూపించనున్నట్లు వివరించారు. సామాన్య కుటుంబాల మధ్య ఇంటి ఉండే ఒక అబ్బాయి కథే ఈ చిత్రమని అన్నారు. కాబట్టి యూనిట్ అంతా కలిసి ఒక టీం గా పనిచేసే చిత్రాన్ని తక్కువ బడ్జెట్ లోనే నిర్మించడం జరిగిందని ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని వీక్షించి తమను ఆశీర్వదించాలని ఆయన కోరారు. తమ చిత్రాన్ని ప్రముఖ సురేష్ ప్రొడక్షన్స్ కొనుగోలు చేసి విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమ సినిమాలో ఉన్న కథ బలాన్ని నమ్మి సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారని తెలిపారు. నూతన సంవత్సరం కానుకగా జనవరి ఒకటో తేదీన చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఆయన వివరించారు.
హీరోయిన్ యామిని భాస్కర్ మాట్లాడుతూ తాను విజయవాడ వాసిని అని గతంలో పలు ప్రముఖ చిత్రాలలో ముఖ్య పాత్రలలో నటించడం జరిగిందన్నారు. ఈ చిత్రంలో హీరో శ్రీ నందు తనకు హీరోయిన్ అవకాశం కల్పించడం ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రంలో తన క్యారెక్టర్ నిజ జీవితానికి ఎంతో దగ్గరగా ఉంటుందని ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని ఆమె తెలియజేశారు.
చిత్ర దర్శకుడు వరుణ్ రెడ్డి మాట్లాడుతూ రొటీన్ కి భిన్నంగా ఈ చిత్రం నిర్మించడం జరిగిందన్నారు. ప్రేమ కథ ప్రేమ కథాంశానికి ఎంటర్టైన్మెంట్ను జోడించడం జరిగిందన్నారు. హార్ట్ బ్రేక్ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను కలిసి వేస్తాయని అన్నారు. ప్రతి సన్నివేశం ఎంతో అద్భుతంగా తీశామని ఈ చిత్రాన్ని జనవరి ఒకటో తేదీన విడుదల చేస్తున్నామని ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని వీక్షించి చిత్రాన్ని విజయవంతం చేయాలని ఆయన ప్రేక్షకులను కోరారు.
Prajavartha Online Telugu News