Breaking News

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఘన స్వాగతం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఘన స్వాగతం లభించింది. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఆర్థిక శాఖమంత్రికి గన్నవరం విమానాశ్రయంలో ఆదివారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని వచ్చిన కేంద్ర మంత్రితో రాష్ట్ర ముఖ్యమంత్రి కొద్దిసేపు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్ నేతృత్వంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ముఖ్యమంత్రి కార్యదర్శి కార్తికేయ మిశ్రా, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, ప్రోటోకాల్ డైరెక్టర్ మోహన్ రావు, విమానాశ్రయం డైరెక్టర్ ఎం ఎల్ కె రెడ్డి, అదనపు ఎస్పీ సత్యనారాయణ, ఆర్డిఓ గుడివాడ ఆర్డిఓ జి బాలసుబ్రమణ్యం, సహాయ ఆహార తనిఖీ అధికారి సిహెచ్ గోపాలకృష్ణ, గన్నవరం తహసిల్దార్ శివయ్య, తదితర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *