Breaking News

4.60 కోట్ల ఖర్చుతో 1590 కిలో లీటర్ల సామర్ధ్యం కలిగిన ఈ.ఎల్.ఎస్.ఆర్ నిర్మాణానికి శంకుస్తాపన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న 50 ఏళ్ల వరకు గుంటూరు నగరంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ఈ.ఎల్.ఎస్.ఆర్ ల నిర్మాణం చేపడుతున్నామని కేంద్ర గ్రామీనాభివ్రుద్ది మరియు కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోని బి.ఆర్ స్టేడియం నందు 4.60 కోట్ల ఖర్చుతో 1590 కిలో లీటర్ల సామర్ధ్యం కలిగిన ఈ.ఎల్.ఎస్.ఆర్ (ఎక్జిస్టింగ్ ఎలివేటేడ్ లెవెల్ సర్విస్ రిజర్వాయర్) నిర్మాణానికి మరియు యన్.జి.ఓ కాలనీలో 1 కోటి రూపాయల వ్యయంతో అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మించడానికి కేంద్ర మంత్రి, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు, గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మహమ్మద్ నసీర్, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు గళ్ళా మాధవి, ఎ.పి.ఐ.డి.సి చైర్మన్ డేగల ప్రభాకర్, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాల రావు, ఎ.పి.హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా, డిప్యూటీ మేయర్ షేక్ సజీల, కార్పొరేటర్లతో కలిసి శంకుస్తాపన చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆదివారం త్రాగు నీటి సరఫరా మెరుగుదలకు ఈ.ఎల్.ఎస్.ఆర్, మెరుగైన ఆరోగ్యం అందించేందుకు యు.పి.హెచ్.సి ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశామన్నారు. గతంలో నిర్మాణం జరిగిన ఈ.ఎల్.ఎస్.ఆర్ లు రూఫ్ తక్కువ మందంతో ఉండటం, ప్లస్టింగ్ చేయకపోవడం వలన నగరంలోని ఎక్కువ ఈ.ఎల్.ఎస్.ఆర్ లు మరమ్మతులకు గురయ్యయన్నారు. ప్రస్తుతం నిర్మించే ఈ.ఎల్.ఎస్.ఆర్ లు 15 సెంటీమీటర్ల మందంతో రూఫ్, ఇన్సైడ్ ప్లాసింగ్ లతో 50 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మాణం చేయనున్నామన్నారు. కాంట్రాక్టర్లు టెండర్ కంటే తక్కువ అమౌంట్ కోడ్ చేసి, నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించుట లేదని గమనించుట జరిగిందని, అధికారులు నిరంతర పర్యవేక్షణ చేసి నాణ్యత పాటించేలా చూడాలన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గళ్ళా మాధవి చొరవతో నూతన యు.పి.హెచ్.సి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, ఈ నిర్మాణం వలన సదరు ప్రాంత ప్రజలకు ఆరోగ్య వసతి మేరుగౌతుందన్నారు.
మేయర్ మాట్లాడుతూ, శంకుస్తాపన చేసిన ఈ.ఎల్.ఎస్.ఆర్, యు.పి.హెచ్.సి నిర్మాణ పనులను వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. పనుల్లో నాణ్యత పాటిస్తూ, గుంటూరు నగరానికి స్వచ్చమైన సమగ్రంగా త్రాగు నీటిని అందించేలా కృషి చేస్తామన్నారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ చొరవతో అమృత్ 2.0 లో గుంటూరు నగరానికి నీటి సరఫరా పనులకు మంజూరైన రూ.360 కోట్లకు సంబంధించి టెండర్ దశలో ఉన్నాయన్నారు.
కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోని ప్రతి ప్రాంతానికి త్రాగు నీటిని మెరుగ్గా అందించడానికి ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నామన్నారు. త్రాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యత దృష్ట్యా నగర పాలక సంస్థ జనరల్ ఫండ్ నుండే ఈ.యల్.యస్.ఆర్ ల నిర్మాణం చేస్తున్నామన్నారు. ఇప్పటికే గత వారం రెండు ప్రాంతాల్లో, ఈ వారం ఒకటి ఈ.యల్.యస్.ఆర్ లు నిర్మాణం చేయుటకు శంకుస్తాపన జరిగిందని, నిర్మాణ పనులు వేగవంతం చేయుటకు చర్యలు తీసుకుంటామన్నారు.
తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మాట్లాడుతూ, తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న ఈ.ఎల్.ఎస్.ఆర్ లు శిధిలావస్తకు చేరి పూర్తి స్తాయిలో త్రాగు నీటి సరఫరా అందించడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే నూతన ఈ.ఎల్.ఎస్.ఆర్ ల నిర్మాణాలు చేపదుతున్నామని, త్వరలో ఆర్.టి.సి కాలని లో కూడా ఈ.ఎల్.ఎస్.ఆర్ నిర్మాణం కు శంకుస్తాపన చేస్తామన్నారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు మాట్లాడుతూ, పశ్చిమ నియోజక వర్గ ప్రజలకు మెరుగైన ఆరోగ్య వసతులు కల్పించుటలో భాగంగా నూతన యు.పి.హెచ్.సి లు కావాలని ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వైద్య ఆరోగ్య శాఖా మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీలను కోరామన్నారు. వారు తక్షణం స్పందించి పి.యం యోజన 15 వ ఫైనాన్స్ నిధుల్లో యు.పి.హెచ్.సి నిర్మాణం కు రూ. 1 కోటి నిధులు మంజూరు చేశారన్నారు.
సమావేశం నందు కార్పొరేటర్లు షేక్ మీరావలి, పడాల సుబ్బారెడ్డి, ఈరంటి వరప్రసాద్, యల్లావుల అశోక్, సంకూరి శ్రినీవసరావు, ఇంచార్జ్ యస్.ఈ సుందర్రామి రెడ్డి, రేట్ పెయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నారాయణ రెడ్డి, నగర పాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *