అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి సాయంత్రం ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం యందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చే వారి ఛాంబర్ లో ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ( ఆప్టా) 2026 డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది.ఈ సందర్భంగా ముఖ్య మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు స్నేహ పూరిత ప్రభుత్వం అని మీ సమస్య లను అన్నింటినీ పరిష్కారం చేస్తుందని, త్వరలో ఆర్ధిక సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షుడు కాకి ప్రకాష్ రావు రాష్ట్రం లో 1 నుండి 10 వ తరగతి వరకు నడపబడుతున్న పాఠశాల ను 1 నుండి 5 ప్రాథమిక పాఠశాల గా 6 నుండి 10 వ తరగతి వరకు ఉన్నత పాఠశాల గా విభజించాలని ముఖ్య మంత్రి కి వినతి పత్రం అందచేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెహది పాఠశాల లకు ఆప్షనల్ హాలిడే విధానం ను పాత పద్ధతి లోనే ఉంచాలని కోరారు. ఫైనాన్స్ సెక్రటరీ నారాయణ అంధ ఉపాధ్యాయులకు ఫేషియల్ అప్ లో మినహాయింపు కల్పించాలి అని వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి కె వెంకట రత్నం, నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల మధుసూదన్ రావు, కృష్ణా జిల్లా కార్యదర్శి కుమార్ పాల్గొన్నారు
Prajavartha Online Telugu News