Breaking News

ఏఆర్టి /సరోగసి జిల్లా స్థాయి సమావేశము

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఈరోజు కలెక్టర్ ఆఫీస్ నందు గర్భస్థ లింగ నిర్ధారణ చట్టము మరియు ఏఆర్టి /సరోగసి జిల్లా స్థాయి సమావేశము ఏ తమీమ్ అన్సరియా ఐఏఎస్, కలెక్టర్ మరియు జిల్లా మ్యాజిస్ట్రేట్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో పాల్గొన్న డాక్టర్ కే విజయలక్ష్మి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి, ఈ సమావేశమునకు 8 – కొత్త స్కాన్ సెంటర్ల రిజిస్ట్రేషన్,14 రెన్యువల్ రిజిస్ట్రేషన్, 2- ఏ ఆర్ టి, 1- సరోగసి దరఖాస్తులు వచ్చాయని, ఈ సెంటర్లను తను మరియు ప్రోగ్రాం ఆఫీసర్లు సందర్శించి, తనిఖీ చేసి ఆమోదం కోసం మీటింగ్లో పెట్టడం జరిగిందని తెలియజేసినారు. సి.హెచ్. వెంకట నాగ శ్రీనివాసరావు, 3వ అడిషనల్ డిస్టిక్ జడ్జి మరియు 2- వ జిల్లా ఎడిషనల్ జడ్జ్ ఇంచార్జ్ మాట్లాడుతూ ఫిబ్రవరి మీటింగులో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా క్రొత్త స్కానింగ్ సెంటర్లను సందర్శిస్తానని తెలియజేసినారు. కలెక్టర్ మాట్లాడుతూ చట్టం ముల్లంఘన జరక్కుండా చూడవలసిన బాధ్యత, జిల్లా అధికారులపై ఉందని, ఈ సమావేశమునకు వచ్చిన దరఖాస్తులను ఆమోదిస్తున్నట్టు తెలియజేసినారు. ఈ సమావేశము నందు కమిటీ సభ్యులు డాక్టర్ ఎ శ్రావణ్ బాబు జిల్లా వ్యాధి నిరోధక టీకాలు అధికారి, డాక్టర్ అనిత ప్రగతి ఐవిఎఫ్ యూనిట్, అరుణ ఐద్వా ఎన్జీవో, ప్రసూన పిడి ఐసిడిఎస్, శ్రీనివాసరెడ్డి డి.ఎస్.పి మహిళ పోలీస్ స్టేషన్, ఫణి రాజేంద్ర,సీడ్స్, ఎన్ వెంకటేశ్వర్లు డిప్యూటీ డెమో, ఇస్మాయిల్ హెల్త్ ఎడ్యూకేటర్, వాణి,మానిటరింగ్ కన్సల్టెంట్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *