అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన సంవత్సర 2026 ప్రారంభోత్సవం సందర్భంగా, మాజీ మంత్రి, కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (కెడిసిసి బ్యాంక్) చైర్మన్ నెట్టెం రఘురామ్ ధర్మపత్ని నెట్టెం స్వర్ణకుమారి తో తమ నివాసంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో అశేష జనవాహిని మధ్య నూతన సంవత్సర శుభాకాంక్షలు స్వీకరించారు. ఈ సందర్భంలో, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, మార్కెట్ యార్డు చైర్మన్ మల్లెల్ల సీతమ్మ, జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర, పట్టణ మండల పార్టీ అధ్యక్షులు మరియు నియోజకవర్గ ముఖ్య నాయకులు హాజరై నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు, కెడిసిసి బ్యాంక్ సిఈఓ శ్యామ్ మనోహర్, ఇతర అధికారులు, ఉద్యోగులు, జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (సొసైటీలు) అధ్యక్షులు, బ్యాంక్ మరియు సొసైటీ యూనియన్ సభ్యులు నెట్టెం రఘురాం కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరం ప్రతి ఇంటికి ఆరోగ్యం, ఆనందం, సుఖసంతోషాలు, ప్రతి రైతుకు సమృద్ధి, యువతకు అవకాశాలు, మహిళలకు భద్రత, ప్రతి కుటుంబానికి శాంతి తీసుకురావాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఉమ్మడి కృష్ణాజిల్లా రైతులు సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రైతుల ఆర్థిక బలోపేతానికి కీలకమైన సహకార వ్యవస్థను మరింత బలపరిచే దిశగా KDCC బ్యాంక్, ఉద్యోగులు, సొసైటీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, అధికారులు, సిబ్బంది సమన్వయం సాధిస్తున్నారని తెలిపారు. జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజలు నన్ను ఇంతటి వాడిని చేశారని ప్రజల విశ్వాసమే తన బలమని, ఆ నమ్మకానికి తగ్గట్టుగా నిజాయితీతో, బాధ్యతాయుతంగా ప్రజాసేవ కొనసాగిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
నియోజకవర్గంలోని గ్రామాల నుంచి నాయకులు, ప్రజలు, డ్వాక్రా సంఘాల మహిళలు పెద్ద ఎత్తున హాజరై నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Prajavartha Online Telugu News