Breaking News

ముఖ్య అధికారులను భేటీ అయిన CRDA కమిషనర్, అడిషనల్ కమిషనర్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన సంవత్సరం సందర్భంగా సచివాలయంలో ముఖ్య అధికారులను CRDA కమిషనర్, అడిషనల్ కమిషనర్ భేటీ అయ్యారు. నూతన సంవత్సరం సందర్భంగా CRDA కమిషనర్ కె.కన్నబాబు ఐ.ఏ.ఎస్., అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవతేజ ఐ.ఏ.ఎస్. అమరావతి సచివాలయంలో పలు శాఖల ఉన్నతాధికారులను కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా APCRDA ఆధ్వర్యంలో సిద్ధం చేసిన బహుమతులను కమిషనర్, అడిషనల్ కమిషనర్ కి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్, పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ఐ.ఏ.ఎస్., సాధారణ పరిపాలన శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(సర్వీసెస్ & H.R.M.) షంషేర్ సింగ్ రావత్ ఐ.ఏ.ఎస్., సాధారణ పరిపాలన శాఖ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి(రాజకీయ) జె.శ్యామలరావు ఐ.ఏ.ఎస్., CMO కార్యాలయ కార్యదర్శులు ప్రద్యుమ్న ఐ.ఏ.ఎస్., ఏ.వి. రాజమౌళి ఐ.ఏ.ఎస్. ని సచివాలయంలో..CRDA కమిషనర్, అడిషనల్ కమిషనర్ కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *