అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గురువారం రాష్ట్ర సచివాలయంలో పలువురు అఖిల భారత సర్వీసుల ఉన్నతాధికారులు,వివిధ శాఖాధి పతులు,సచివాలయం,ఇతర విభాగాల అధికారులు ఉద్యోగులు,పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తదితరులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.సిఎస్ కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ప్రధానంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్,ముఖ్య కార్యదర్శులు ముఖేష్ కుమార్ మీనా,జె.శ్యామల రావు, జయలక్ష్మి తదితర ముఖ్య కార్యదర్శులు,కలక్టర్లు,జెసిలు,వివిధ శాఖాధిపతులు,సచివాలయ ఉద్యోగుల సంఘం ఇతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఉన్నారు.
Prajavartha Online Telugu News