గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన ప్రథమ కర్తవ్యమని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. రాజకీయాలు కేవలం ఎన్నికల సమయానికే పరిమితమని, గెలిచిన తర్వాత కేవలం అభివృద్ధిపైనే తన దృష్టి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం గన్నవరం మండలంలోని కొత్తగూడెం, తెంపల్లె గ్రామాల్లో ఆయన పర్యటించారు. ‘పల్లె పండుగ 2.0’ కార్యక్రమంలో భాగంగా రూ.85 లక్షల వ్యయంతో నిర్మించిన రెండు సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను ఆయన ప్రారంభించారు. అలాగే రూ.1.85 లక్షలతో నిర్మించిన గోకులం షెడ్‌ను ప్రారంభించడంతో పాటు, రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మరో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు.
అనంతరం రీ-సర్వే గ్రామ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే, రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టా పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు. ప్రజల సొంత ఆస్తులైన భూములకు సంబంధించిన పాస్ పుస్తకాలపై గత పాలకులు తమ ఫోటోలు వేసుకోవడం ఎంతవరకు ధర్మం? అని ప్రశ్నించారు. ఆస్తి హక్కు పత్రాలపై రాజకీయ నాయకుల బొమ్మలు ఉండకూడదనే ఉద్దేశంతోనే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాజముద్రతో కూడిన పట్టాలను అందిస్తోందని వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో గన్నవరం నియోజకవర్గం రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉందని యార్లగడ్డ తెలిపారు. పాస్ పుస్తకాల పంపిణీ అనంతరం ‘ప్రజా దర్బార్’ నిర్వహించి, ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. బాధితులకు సత్వర న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి నిరుపేదకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యతను తానే తీసుకుంటానని, తాను దొంగ పట్టాలు ఇచ్చే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. కొత్త కంపెనీలను నియోజకవర్గానికి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని, ఉన్నత విద్య అభ్యసించిన యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.అసిస్టెంట్ కలెక్టర్ ఫరీన్, గన్నవరం మండల తాసిల్దార్ కే శివయ్య, ఎండిఓ స్వర్ణలత , గన్నవరం ఏఎంసి చైర్మన్ గూడవల్లి నరసింహారావు, ప్రత్యేక అధికారి షాహిద్ బాబు, గన్నవరం మండల టిడిపి అధ్యక్షులు గూడపాటి తులసి మోహన్, మండల టిడిపి ప్రధాన కార్యదర్శి బోడపాటి రవి, తెంపల్లి గ్రామ టిడిపి అధ్యక్షులు మరియు మచిలీపట్నం పార్లమెంట్ టీడీపీ సెక్రటరీ జొన్నలగడ్డ సుధాకర్, కొత్తగూడెం గ్రామ టిడిపి అధ్యక్షులు కొణతం పోతురాజు, టిడిపి నాయకులు చిరుమామిళ్ల సూర్యం, గుజ్జర్లపూడి బాబురావు, మేడేపల్లి రమ, కొసరాజు సాయిరాం, కొండేటి వెంకటేశ్వరరావు, గరిమెళ్ళ నరేంద్ర, బండి భాస్కర్, కాగితాల నాగరాజు, మల్లారెడ్డి కిషోర్, వేమూరి రాంబాబు, నిమ్మకూరి మధు, వీర్ల రాంబాబు, నిమ్మకూరి ప్రతాప్, మాదు ప్రసాద్, వాకా మార్కు, నడ్డీ శివ నాగరాజు, మందపాటి వెంకటేశ్వరరావు, నల్లూరి వెంకటేశ్వరరావు, పోలవరపు శ్రీనివాస్, కంచర్ల సూర్య, వలివేటి కిషోర్, మణిమాల వెంకట శివ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News