Breaking News

రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ సక్రంగా జరగాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో రెవెన్యూ సంబంధిత సమస్యలను వీలైనంత వరకూ తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ఈ నెల 2 నుండి 9 వరకూ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నందున ఆ పంపిణీ కార్యక్రమం సక్రమంగా జరిగేలా జిల్లా కలక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కలక్టర్లను ఆదేశించారు. రైల్వే అండర్ బ్రిడ్జిలు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వేకు సంబంధించి పెండింగ్ భూసేకరణ కేసులకు సంబంధించిన అంశాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణి, పాజిటివ్ పబ్లిక్ పెరసెప్సన్, డాక్యుమెంట్ అప్లోడ్ ఏజెంట్ అంశాలపై శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ పాత పట్టాదార్ పాస్ పుస్తకాల స్థానే రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని చేపట్టడం జరిగిందని ఏడాది పాటు ప్రతినెలా ఈపాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించి భూమి ఉన్న ప్రతి రైతుకూ ఈకొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందించడం జరుగుతుందని తెలిపారు.
జిల్లా కలక్టర్లు ఈపాస్ పుస్తకాల పంపిణీని స్వయంగా పరిశీలించాలని స్థానిక ప్రజా ప్రతినిధుల సమక్షంలో పంపిణీ జరిగేలా చూడాలని ఆదేశించారు.ఇప్పటికే రెవెన్యూ శాఖ ద్వారా జిల్లాలకు తగిన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి వర్యులు కూడా జిల్లాల్లో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గోననున్నారని సిఎస్ పేర్కొన్నారు.

దశల వారీగా అన్ని రైల్వే లెవెల్ క్రాసింగ్ లను తొలగించి వాటి స్థాన్ రైల్వే ఓవర్ బ్రిడ్జిలు లేదా రైలేవే అండర్ బ్రిడ్జిల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నందున అవసరమైన ఆర్ఓబి,ఆర్ యుబిల నిర్మాణానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి బి.వి.రంగా రావు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *