-తిరుపతి అర్బన్ గిరిపురం నందు గోధుమ పిండి పంపిణీ చేసిన జిల్లా ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కింద ఎఫ్ పి షాపుల ద్వారా కిలో రూ.20 తో గోధుమ పిండి పంపిణీ చేస్తున్నదని జిల్లా ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ మరియు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారప రెడ్డి మౌర్య పేర్కొన్నారు. శుక్రవారం తిరుపతి పట్టణం గిరిపురంకు చెందిన ఎఫ్ పి షాపు నెం 09 నందు సబ్సిడీ గోధుమ పిండిని జిల్లా ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ మరియు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ శ్రీనివాస రాజు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గల 26 జిల్లాల్లో సబ్సిడీ కింద కిలో రూ.20తో గోధుమ పిండి పంపిణీ చేయడానికి నిర్ణయించిందని తెలిపారు. ఇందులో భాగంగా తిరుపతి పట్టణానికి 50 టన్నుల గోధుమ పిండి సరఫరా చేసిందని తెలిపారు. తిరుపతి పట్టణంలో గల 102 ఎఫ్ పి షాపుల పరిధిలో ఉన్న 62 వేల రేషన్ కార్డుదారులకు ఈ గోధుమ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
Prajavartha Online Telugu News