Breaking News

దేశంలో పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
2025-26 ఆర్ధిక సంవత్సరంలో 9 నెలల కాలంలో దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో 25.3 శాతం ఆకర్షించి అగ్రస్థానంలో ఏపీ.

⦁ ఈ ఆర్ధిక సంవత్సరంలో మొదటి మూడు త్రైమాసికాలకు గానూ పెట్టుబడుల్లో గరిష్ట వాటాను కైవసం చేసుకున్న ఆంధ్రప్రదేశ్.

⦁ బ్యాంక్ ఆఫ్ బరోడా విడుదల చేసిన నివేదికలో అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో నిలిచిన ఏపీ.

⦁ ఒడిశా 13.1%, మహారాష్ట్ర 12.8% వాటాను దక్కించుకున్నట్టు వెల్లడించిన బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక.

⦁ దేశంలోని మొత్తం ప్రతిపాదిత పెట్టుబడుల్లో 51.2% శాతం మేర ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రలే ఆకర్షించిట్టు నివేదికలో వెల్లడి.

⦁ పొరుగు రాష్ట్రం తెలంగాణా 9.5 శాతం పెట్టుబడులతో తదుపరి స్థానంలో ఉన్నట్టు తేల్చిన బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక.

⦁ మొత్తం 26 లక్షల కోట్ల పెట్టుబడులకు గానూ అత్యధికంగా 22 శాతం ఇంధన రంగం, 21 శాతం రసాయన పరిశ్రమలు, 17 శాతం మెటల్ ఉత్పత్తులు, 10 శాతం ఐటీ రంగంలో వచ్చినట్టు నివేదికలో స్పష్టం.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *