-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
లేఔట్ రెగ్యులరైజేషన్ మరియు బిల్డింగ్ పీనలైజేషన్ కు ఇదొక మంచి అవకాశం అని, ఈ స్కీమ్లను సద్వినియోగం చేసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంవారు జారీ చేసిన G.O.Ms.No.134, MA&UD, dated 26-07-2025 మరియుG.O.Ms.No.1173, MA&UDDepartment, Dt.27.10.2025 ద్వారా లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీము నందు ఇప్పటి వరకు 1,338 ధరఖాస్తులను స్వీకరించి పరిష్కరించారని తద్వారా ఇప్పటి వరకు రూ.11,37,12,665/- (పదకుండు కోట్ల ముప్పై ఏడు లక్షల పన్నెండు వేల ఆరు వందల అరవై ఐదు రూపాయలు) ఆదాయము వచ్చిందని అన్నారు. అంతేకాకుండా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంవారు జారీ చేసిన G.O.Ms.No.225, MA&UD Department, Dt.12.11.2025 ద్వారాబిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ నందు ఇప్పటి వరకు1089 ధరఖాస్తులను స్వీకరించారని, తద్వారా రూ.1,57,05 ,000/- (ఒక కోటి యాబై ఏడు లక్షల ఐదు వేలు) ఆదాయము వచ్చిందని తెలిపారు.
భవన క్రమబద్ధీకరణ పథకం కింద 1985 జనవరి 1వ తేదీ తర్వాత నుండి 2025 ఆగస్టు 31వ తేదీ వరకు నిర్మించిన అనధికార భవనాలు, లేదా ఆమోదిత నిర్మాణ అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన అదనపు విస్తరణలు క్రమబద్ధీకరణకు అర్హులని, అర్హులైన భవన యజమానులు పథకం 11.03.2026 లోపు దరఖాస్తులను సమర్పించవలసి ఉంటుందని, దరఖాస్తులు ఆన్‌లైన్ పోర్టల్ www.bps.ap.gov.in ద్వారా మాత్రమే సమర్పించాలని, దరఖాస్తులను అర్హత కలిగిన లైసెన్స్డ్ టెక్నికల్ పర్సనల్ (LTPs) ద్వారా తయారు చేసి, అవసరమైన పత్రాలతో కలిపి ఆన్‌లైన్ మాడ్యూల్‌లో అప్‌లోడ్ చేయాలని, ఈ పథకం కింద 31.12.1997కు ముందు నిర్మించిన భవనాలకు ప్రభుత్వం క్రమబద్ధీకరణ రుసుముపై 25% రాయితీ (rebate) మంజూరు చేసిందని, దీని కోసం 31.12.1997 లోపు చెల్లించిన ప్రాపర్టీ ట్యాక్స్ రశీదు జతపరచాలని అన్నారు.
అర్హులైన అన్ని భవన యజమానులు నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేసుకొని తమ భవనాలను క్రమబద్ధీకరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గడువు ముగిసిన తరువాత దరఖాస్తు చేయని వారు లేదా చట్ట విరుద్ధంగా నిర్మాణాలు కొనసాగించేవారిపై ప్రస్తుత చట్టాల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జారీ చేసినందున దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.
Prajavartha Online Telugu News