Breaking News

సామాజిక రుగ్మతలపై సమరభేరి మోగించిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే

-ఎంపీ కేశినేని శివ‌నాథ్
-బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో సావిత్రిబాయి వూలే 195జ‌యంతి వేడుక‌లు
-ఉత్త‌మ ఉపాధ్యాయుల‌ను స‌న్మానించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సామాజిక రుగ్మతలపై సమరభేరి మోగించిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు. సావిత్రిబాయి పూలే 195 జయంతిని పురస్కరించుకుని శనివారం ప‌శ్చిమ నియోజ‌వ‌ర్గం చిట్టిన‌గ‌ర్ లోని రాకేష్ ప‌బ్లిక్ స్కూల్ లో ఇంట‌ర్ నేష‌న‌ల్ బిసి వెల్పేర్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే ఉత్త‌మ ఉపాధ్యాయ అవార్డుల మ‌హోత్స‌వ కార్య‌క్రమంలో రాష్ట్ర దూదేకుల కార్పొరేష‌న్ చైర్మ‌న్ కె.నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్సీ టిడిపి రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుద్దా వెంక‌న్న‌ల‌తో క‌లిసి ఎంపీ కేశినేని శివ‌నాథ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

అనంత‌రం బెస్ట్ టీచ‌ర్ అవార్డ్ కు ఎంపికైన మౌలానా ఆజాద్ ఊర్దూ మున్సిప‌ల్ హైస్కూల్ టీచ‌ర్ వి.రాధిక‌, గాంధీజీ మున్సిప‌ల్ హైస్కూల్ జె.నిర్మ‌ల‌, ఎస్.ఎన్.ఎమ్.సి ఉర్ధూ గ‌ర్ల్స్ హైస్కూల్ టీచ‌ర్ వి.జ‌య‌ల‌క్ష్మీ, ఆర్.జి.ఎమ్.సి.హెచ్ స్కూల్ టీచ‌ర్ టి.న‌ళిని, గాంధీ మున్సిప‌ల్ హైస్కూల్ టి.భ‌ర‌త్ ల‌క్ష్మీ, ఎస్.ఎన్.ఎమ్.యు ఉర్ధూ గ‌ర్ల్స్ హైస్కూల్ టీచ‌ర్ డి.ర‌త్న కుమారి, పి.ఎస్.ఎమ్. గ‌ర్ల్స్ హైస్కూల్ టీచ‌ర్ యం.గ్రేస్, మ‌హ్మ‌ద్ అలీపురం మున్సిప‌ల్ హైస్కూల్ టీచ‌ర్ యం.క‌ళ్యాణి, మౌలాజా ఆజాద్ ఉర్ధూ మున్సిప‌ల్ హైస్కూల్ పి.య‌శోద దేవి, ఎస్.పి.ఎస్.ఎమ్.హెచ్ హైస్కూల్ రిటైర్డ్ టీచ‌ర్ కె.రేణాకా దేవి లకు ఎంపీ కేశినేని శివ‌నాథ్ మెమొంటో, సర్టిఫికెట్ అందజేసి శాలువ తో సత్కరించినా రు

ఈ సంద‌ర్భంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ ఎన్నో అవమానాలు, అవహేళనలను అధిగమించి మహిళలకు చదువు, సంస్కారం నేర్పిన సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. సమాజంలో మహిళా సాధికారతకు కృషి చేసిన మహనీయులు అన్నారు.దేశంలోనే తొలి సారిగా మహిళా సాధికారతకు కృషి చేసినటువంటి సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే ను ఆదర్శంగా తీసుకొని టిడిపి మహిళా సాధికారత కొరకు నిరంతరం కృషి చేస్తుందన్నారు. , సావిత్రిబాయి పూలేని ఆదర్శం గా తీసుకొని ప్రతి ఉపాధ్యాయులు అంకితభావంతో కృషియాలన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో రిటైర్డ్ ఇంజనీర్ పరవస్తు చిన్నయ సూరి పీఠం చైర్మన్ టి శోభనాద్రి , భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చ అధ్యక్షుడు శ్రీనివాస్ , నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు ధన్వంతరి , చిట్టి నగరం అమ్మవారి గుడి కోశాధికారి పిల్లా శ్రీను , బార్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి నాగేశ్వరావు, బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నమ్మి అప్పారావు , కోశాధికారి బుల్లబ్బాయి గారు, రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ ఎం సత్యనారాయణమూర్తి, వాల్మీకి బోయ సంఘ నాయకులు సాంబశివరావు, బాయన శేఖర్ బాబు, బి.ఎస్.కె ప‌ట్నాయ‌క్, ఎస్.ఎ.ఎస్ డిగ్రీ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ వివి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *