Breaking News

సావిత్రిబాయి పూలే ఆశయాల సాధనే లక్ష్యం… : పొనుగుపాటి శ్రీనివాస్‌

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సావిత్రభాయి పూలే జయంతి సందర్బంగా విజయవాడలోని ఆలిండియా బహు జన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యాలయం లో ఆలిండియా బహు జన్ సమాజ్ పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షులు పొనుగుపాటి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పొనుగుపాటి శ్రీనివాస్‌ మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే గొప్ప సంఘ సంస్కర్త, సామాజిక విప్లవకారిణి అని కొనియాడారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, మహిళల హక్కుల కోసం పోరాటం చేసిన ధీశాలన్నారు. ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని, స్త్రీ విద్య కోసం కృషి చేసిన మొట్టమొదటి మహిళా ఉద్యమకారిణి అని అన్నారు. తన భర్త మహత్మా జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుస్తూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం గొప్ప పోరాటం చేశారన్నారు. వితంతు వివాహాలను ప్రోత్సహించారని, బాల్యవివాహాలకు వ్యతిరేకంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహించారన్నారు. సావిత్రిభాయిపూలే ఆశయ సాధనే లక్ష్యంగా ఆలిండియా బహు జన్ సమాజ్ పార్టీ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చిన్న సిటీ యూత్ అధ్యక్షులు కత్తుల బోస్ విజయలక్ష్మి, సీరా లక్ష్మి ప్రసాద్, వాసు, బాజీ, వెంకటేశ్వరావు, రాజు,
అరుణాచలం గాంధీ, AIBSP నాయకులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *