Breaking News

విద్యుత్ చార్జీలు మరింత తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

నూజివీడు/ ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో రానున్న రోజులలో విద్యుత్ చార్జీలు మరింత తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి చెప్పారు. నూజివీడు లోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం పత్రికా విలేఖరుల సమావేశంలో మంత్రి పార్థసారధి మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారులకు వస్తే చార్జీలు పెంచబొమని మాటకు తాము కట్టుబడి ఉన్నామని, అంతేకాక ప్రస్తుతం ఉన్నా విద్యుత్ చార్జీలు తగ్గించేందుకు సి ఎం చర్యలు తీకుంటున్నారన్నారు.

ప్రజలకు మంచి చేసే తమ ప్రభుత్వం ట్రూ డౌన్ తో 4789 కోట్ల రూపాయల విద్యుత్ చార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా తగ్గించిందన్నారు. 2019 ముందు తమ ప్రభుత్వ సమయంలో వేలాది కోట్ల రూపాయలతో సోలార్, విండ్ పవర్ ప్లాంట్లు నెలకొల్పి రూ. 2. 49 లకే విద్యుత్ అందిస్తామని కంపెనీలు ముందుకు వచ్చినా, కక్షపూరిత ధోరణితో గత ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. సోలార్, విండ్ విద్యుత్ సంస్థలు 2 రూపాయల 49 పైసలకే విద్యుత్ సరఫరాల చేస్తామన్నా గత ప్రభుత్వం వాటిని వ్యతిరేకించి , రూ. 5. 19, రూ.5. 50 రూపాయల అధిక రేట్లకు ఓపెన్ మార్కెట్ లో విద్యుత్ కొనుగోలుకు అగ్రిమెంట్ కుదుర్చుకుని, విద్యుత్ భారాన్ని ప్రజల నెత్తిన వేశారన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగా ట్రూ అప్ పేరుతో 4789 కోట్ల రూపాయలు ప్రజలపై విద్యుత్ చార్జీల భారం పడిందన్నారు. ఆ భారం ప్రజలపై వేయకుండా తమ ప్రభుత్వమే భరిస్తుందని , తమ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సుపరిపాలనకు ఇది నిదర్శనమన్నారు. ఒక విజనరీ కలిగిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు నాయకత్వం లో ప్రజలకు సుపరిపాలన ఫలాలు అందుతున్నాయన్నారు. ప్రజలకు తమకు ఇచ్చిన అధికారాన్ని ఒక బాధ్యతగా భావించి రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి కస్టోడియన్ గా ఉన్నారన్నారు. గత నవంబర్ నుండి తమ ప్రభుత్వం విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేస్తున్నదని, యూనిట్ కి 13 చొప్పున తగ్గించామన్నారు. 2019 నాటికి తమ ప్రభుత్వం హయాంలో విద్యుత్ రంగంలో మిగులు విద్యుత్ తో ఉంటే దానిని గత ప్రభుత్వం లక్షన్నర కోట్ల రూపాయల అప్పుతో విద్యుత్ రంగాన్ని అదోగతి పాలు చేసిందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా, పర్యాటకంగా, సాఫ్ట్ వేర్ రంగాలను అభివృద్ధి చేసి రాష్ట్రాభివృద్ధి ని గాడిలో పెట్టామన్నారు. సోలార్, విండో, బయో విద్యుత్ రంగాలలో 80 గిగావాట్ల విద్యుత్ ను తక్కువ ధరకు తీసుకునే విధంగా అగ్రిమెంట్ తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నిలిపేందుకు ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి బాటలో నిలిపేందుకు విదేశాల నుండి లక్షల కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టేలా పారిశ్రామికవేత్తలను ఒప్పించి పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారని, వీటి ద్వారా రాష్ట్రంలోని లక్షలాదిమంది యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు. సూర్య ఘర్ యోజన పధకం కింద పేదలకు సోలార్ విద్యుత్ యూనిట్లు అందిస్తున్నామని, ఎస్సీ, ఎస్టీ లకి నూరు శాతం సబ్సిడీ, బీసీ లకు అదనంగా 50 వేలు అదనంగా సబ్సిడీ అందిస్తున్నామన్నారు. రైతులు పొలాల్లో సోలార్ విద్యుత్ యూనిట్లు ఏర్పాటుచేసుకుంటే ప్రోత్సాహం అందిస్తామన్నారు. మన రాష్ట్రం లో అభివృద్ధిని చూసి ఇతర రాష్ట్రాలు అసూయ ఫీల్ అవుతున్నాయాన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, గంజాయి నిర్మూలన కు చర్యలు తీసుకుంటున్నామని, గంజాయి ని సరఫరా చేసేవారిపై కేసులు నమోదు చేసి, కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సరైన ప్రణాళిక లేకుండా పేదల గృహ నిర్మాణాలను పూర్తి చేయలేదన్నారు. రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను రాజముద్రతో జారీ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం పంచాయతీల నిధులు పంచాయతీ సిబ్బందికి తెలియకుండానే మయంలో చేసిందన్నారు. ఉపముఖ్యమంత్రి పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నారని, రాష్టంలోని గ్రామాలలో 5 వేల కిలోమీటర్ల మేర రోడ్లు, ప్రతీ ఇంటికీ త్రాగునీటి పైప్ కనెక్షన్ అందిస్తున్నరన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *