Breaking News

భూ రికార్డులు మార్పు చేసేందుకు వీలు లేకుండా ఆధునిక పరిజ్ఞానంతో డిజిటలైజేషన్

-ప్రజల హక్కులను గౌరవిస్తూ వారికి భరోసా కల్పించడమే సుపరిపాలన లక్ష్యం
-మర్రిబంధంలో రాజముద్రతో ముద్రించిన పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి

నూజివీడు/ ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
భూ రికార్డులను ఎవరూ మార్పు చేసేందుకు వీలులేకుండా ఆధునిక పరిజ్ఞానంతో డిజిటలైజేషన్ చేస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి చెప్పారు. నూజివీడు మండలం మర్రిబంధం గ్రామంలో మీ భూమి.. మీ హక్కు కార్యక్రమంలో రాజముద్రతో ముద్రించిన పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు మంత్రి పార్థసారధి అందించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారధి మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి హక్కులను గౌరవిస్తూ వారికి భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మీ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును అందించే పాలనను ముఖ్యమంత్రి అందిస్తున్నారన్నారు. పేదవారు రూపాయి, రూపాయి దాచుకుని కొనుకున్న భూములపై వారికి హక్కులు లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తీసుకువచ్చిందని, గత ప్రభుత్వం రాజకీయ కక్షలతో రెవిన్యూ రికార్డులలో భూముల వివరాలను తమ రాజకీయ అనుయాయులకు అనుకూలంగా మార్పులు చేసిందని, దీని కారణంగా జిరాయితీ భూములను సైతం 22A వంటి వివాదాస్పద భూముల జాబితాలో చేరి, ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ల్యాండ్ టైటలింగ్ ఆక్ట్ ద్వారా భూములపై భూమీ యజమానికి హక్కు ఉన్నాది, లేనిదీ తెలియకుండా చేశారన్నారు. పట్టాదార్ పాస్ పుస్తకాలపై ఉండాల్సింది రాజముద్ర అని, ఎవరో వ్యక్తి ఫోటో కాదన్నారు. ప్రజల హక్కులను కాపాడేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తమ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రెవిన్యూ, భూ సమస్యలను నిర్దిష్టమైన సమయంలోగా పరిష్కరించాలని మంత్రులను అధికారులను ఆదేశించారన్నారు. ఇటీవల 22A భూ సమస్యల పరిష్కారంపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకుని వివాదాస్పదం కానీ భూములను 22A నుండి తొలగించారన్నారు. ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేసే పథకాలపై ప్రజల అభిప్రాయాలను తీసుకుని మరింత పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా అమలు చేస్తున్నదన్నారు.
కార్యక్రమంలో నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, తహసీల్దార్, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *