Breaking News

ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించండి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించమని విజయవాడ నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను, విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో అధికారులందరూ పరిశీలించాలని, అర్జీదారులకు వారి సమస్యకు శాశ్వతమైన పరిష్కారం అందిస్తామన్న భరోసాని ఇవ్వడమే కాకుండా సత్వరమే అందించేటట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 12 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళిక సంబంధించినవి 1, ఇంజనీరింగ్ 3, రెవిన్యూ 3, పబ్లిక్ హెల్త్ 2, హార్టికల్చర్ 1, ఎస్టేట్ 2 మొత్తం కలిపి 12 ఫిర్యాదులను అందుకున్నారు అధికారులు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ (జనరల్) ఏ. రవీంద్రరావు, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కే అర్జునరావు, చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్నకుమార్,చీఫ్ ఇంజనీర్ i/c పి సత్యకుమారి, ఇంచార్జ్ పర్యవేక్షణ ఇంజనీర్ వర్క్స్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్టేట్ ఆఫీసర్ ఎ. శ్రీధర్, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్,డిఎఫ్ఓ మాల్యాద్రి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *