Breaking News

గృహ హింసను అరికడదాం

– గృహ హింస మన సంస్కృతి కాదు
– కలెక్టర్ (ఎఫ్ఎసి) వై మేఘా స్వరూప్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గృహ హింసను అరికట్టేందుకు సమాజం మొత్తం బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ (ఎఫ్‌ఏసీ) / జాయింట్ కలెక్టర్
వై. మేఘా స్వరూప్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో “గృహ హింసను అరికడదాం – గృహ హింస మన సంస్కృతి కాదు” అనే అంశంపై రూపొందించిన అవగాహనా పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వై మేఘా స్వరూప్ మాట్లాడుతూ, గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం (PWDVA–2005) మహిళలకు చట్టపరమైన రక్షణ, సహాయం కల్పించే ముఖ్యమైన చట్టమని తెలిపారు. ఈ చట్టం ప్రకారం గృహ హింస అనగా కేవలం శారీరక హింస మాత్రమే కాకుండా, మానసిక / భావోద్వేగ వేధింపులు, మాటలతో అవమానించడం, ఆర్థిక వేధింపులు, లైంగిక హింస కూడా గృహ హింసగా పరిగణించ బడతాయని స్పష్టం చేశారు. One Stop Centre (OSC) ద్వారా గృహ హింసకు గురైన మహిళలకు ఉచితంగా సమగ్ర సేవలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఇందులో కౌన్సెలింగ్ సేవలు లీగల్ ఎయిడ్ / న్యాయ సహాయం (ప్రొటెక్షన్ ఆర్డర్, రెసిడెన్స్ ఆర్డర్, మెంటెనెన్స్, కాంపెన్సేషన్ కోసం సహాయం) మెడికల్ సహాయం పోలీస్ సహకారం & FIR ఫెసిలిటేషన్ తాత్కాలిక ఆశ్రయం (షెల్టర్ హోం) కేస్ రిజిస్ట్రేషన్, ఫాలో అప్ & రిహాబిలిటేషన్ సపోర్ట్ ప్రొటెక్షన్ ఆఫీసర్‌తో సమన్వయం వంటి సేవలు ఉంటాయని వివరించారు. OSC మహిళలకు సురక్షిత వాతావరణం, న్యాయ సహాయం, మానసిక ధైర్యం అందించే కీలక కేంద్రంగా పనిచేస్తోందని తెలిపారు. గృహ హింసకు సంబంధించిన అత్యవసర పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న టోల్ ఫ్రీ నంబర్లను వినియోగించు కోవాలని సూచించారు. 181 – మహిళల హెల్ప్‌లైన్ / One Stop Centre (OSC) 112 – ఎమర్జెన్సీ సేవలు (పోలీస్, అంబులెన్స్), 1091 – మహిళల పోలీస్ హెల్ప్‌లైన్ , 1098 – చైల్డ్ హెల్ప్‌లైన్ (పిల్లలు ఉంటే) ఈ నంబర్లు 24×7 పనిచేస్తాయని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి టి శ్రీదేవి తెలిపారు. రాజమహేంద్రవరం One Stop Centre గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, MCH బ్లాక్ – 1వ అంతస్తులో పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి టి. శ్రీదేవి, కెఆర్‌ఆర్‌సి ఎస్‌డీసీ కె. భాస్కర్ రెడ్డి, సీపీవో ఎల్. అప్పలకొండ, డీఎల్‌డీవోలు పి. వీణా దేవి, ఏ. స్లివా రెడ్డి, డీఎస్పీ బి. విద్య తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *