గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్నక్యాంటీన్ల వద్ద ఆహ్లాదకరమైన, పరిశుభ్ర వాతావరణం అందించేందుకు అక్షయపాత్ర, జియంసి సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. మంగళవారం ఆర్టీఓ కార్యాలయం రోడ్ లోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలోని అన్న క్యాంటీన్ల పరిసరాలు పచ్చదనంతో ఉండేలా చర్యలు తీసుకోవాలని అక్షయపాత్ర, జిఎంసి సిబ్బంది ఆదేశించారు. ఫ్లోర్, నీటి వసతి, లైట్లు వంటి మౌలిక వసతులకు సంబంధించి సమస్యలు రాకుండా చూడాలని ఇంజినీరింగ్ అధికారులను, జిఎంసి నుండి కేటాయించబడిన నోడల్ అధికారులు రోజు పర్యవేక్షణ చేయాలన్నారు.
Prajavartha Online Telugu News