విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రైమ్ 9 న్యూస్ ఆధ్వర్యంలో విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ద్వారా నిర్వహించిన కామధేను అవార్డ్స్–2025 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ నటుడు, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ముఖ్య అతిథిగా పాల్గొనగా, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం, డా. హరిప్రసాద్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వివిధ రంగాల్లో విశేష కృషి చేసి సమాజ అభివృద్ధికి తోడ్పడిన ప్రముఖులను సన్మానించి, కామధేను అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి శాసనసభ్యులు ఆరాణి శ్రీనివాసులు, పూతలపట్టు శాసనసభ్యులు మురళి మోహన్, ప్రముఖులు రామచంద్ర యాదవ్, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, టీడీపీ నాయకులు నరసింహ ప్రసాద్ తదితర ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Prajavartha Online Telugu News