గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నక్యాంటీన్లల్లో ఆహార సరఫరాకి నిర్దేశిత సమయాన్ని పాటించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అక్షయ పాత్ర సిబ్బందిని ఆదేశించారు. బుధవారం మిర్చి యార్డ్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లలో నాణ్యమైన, రుచికరమైన ఆహారం కేవలం రూ.5 అందించడంపై పేద ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. క్యాంటీన్లలో సమయపాలన పాటించాలన్నారు. ఆహారం అందించే పాత్రలు, ప్లేట్ లు శుభ్రంగా ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. ప్రధానంగా ఆహార సరఫరా అనంతరం ప్రాంగణం శుభ్రం చేయాలని ఆదేశించారు.
Prajavartha Online Telugu News