విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH), విజయవాడ, జనవరి 7, 2026న విజయవాడ, ఎనికేపాడు లోని ఆర్‌టీఐహెచ్ కార్యాలయంలో నలందా ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కు చెందిన నలందా డిగ్రీ కళాశాలతో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది.
ఈ సందర్భంగా ఆర్‌టీఐహెచ్ సీఈవో జి. కృష్ణన్ మరియు పార్ట్‌నర్‌షిప్స్ హెడ్ నందన్ టాండి ఆర్‌టీఐహెచ్ లక్ష్యాలు, కార్యక్రమాలు, కార్యకలాపాల గురించి వివరించారు. అలాగే ముఖ్యమంత్రి “ఒక కుటుంబం – ఒక వ్యాపారవేత్త (One Family – One Entrepreneur)” అనే దూరదృష్టి గల విజన్‌పై స్పష్టత ఇచ్చారు.
నలందా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎం. అనురాధ మేడం మరియు ప్లేస్‌మెంట్ ఆఫీసర్ బి. చంద్రగిరి బాబు ఆర్‌టీఐహెచ్ విజయవాడ అందిస్తున్న సేవలపై ఆసక్తి వ్యక్తం చేస్తూ, విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్ మెంటరింగ్, ఇన్నోవేషన్ సపోర్ట్, ఇంటర్న్‌షిప్స్, ఇండస్ట్రీ కనెక్ట్ వంటి అవకాశాలు కల్పించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్‌టీఐహెచ్ ప్రోగ్రామ్ అసోసియేట్స్ – పార్ట్‌నర్‌షిప్స్ కోటేశ్వరరావు మాదాసు మరియు అనిల్ కుమార్ మున్నంగి కూడా పాల్గొన్నారు. ఈ అవగాహన ఒప్పందం ద్వారా విద్యా సంస్థలు–పరిశ్రమల మధ్య అనుసంధానం బలపడడంతో పాటు, విద్యార్థుల్లో వ్యాపారోద్ధమ ఆలోచనలకు మరింత ప్రోత్సాహం లభించనుంది.
Prajavartha Online Telugu News