Breaking News

ఏ పథకాలను అమలు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలి… : నాగేంద్ర నాయక్ చౌహన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేసిందని వైసీపీ ఎస్టీ సెల్ స్టేట్ సెక్రటరీ నాగేంద్ర నాయక్ చౌహాన్, ఆరోపణలు చేశారు. 18 నెలల కాలంలో ఏ ఏ పథకాలను అమలు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైసిపి ఎస్టీ సెల్ స్టేట్ సెక్రటరీ నాగేంద్ర నాయక్ చౌహన్ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలతో పాటు, అనేక హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మరిచిందన్నారు. 3వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని ఇంతవరకు ఇవ్వలేదన్నారు.18 సంవత్సరములు దాటిన మహిళలకు 1500 ఇస్తానని ఇవ్వలేదన్నారు. ఇలా అనేక పథకాలు అమలు చేయలేదన్నారు. గత వైసిపి ప్రభుత్వం 5 సంవత్సరాలలో 3లక్షల కోట్లు అప్పు చేస్తే, కూటమి 18 నెలల కాలంలో 3లక్షల 50వేల కోట్లు అప్పు చేసిందన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఆదివాసీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగనన్న పాలన రావాలని, నేడు రాష్ట్రంలో వైసీపీని బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *