Breaking News

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయండి:సిఎస్ విజయానంద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజధాని ప్రాంతంలో తొలిసారిగా ఈనెల 26వ తేదీన 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించనున్న నేపధ్యంలో అందుకు సంబందించి పటిష్టమైన విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల సన్నాహక ఏర్పాట్లపై ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఈనెల 26వతేదీ ఉదయం రాజధాని ప్రాంతంలో తొలిసారిగా బహిరంగ ప్రదేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నందన ఆకార్యక్రమం విజయంతానికి వివిధ శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించి అవసరమైన సూచనలు జారీ చేశారు.వేడుకల ప్రాంగణంలో తగిన తాగీనీటి వసతి,పారిశుద్ధ్య నిర్వహణ,తాత్కాలిక మరుగు దొడ్లు,బారీ కేడింగ్,ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.ఏర్పాట్ల విషయంలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేని రీతిలో గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు.
గణతంత్ర దినోత్సవ వేడుకల నేపధ్యంలో లోక్ భవన్,హైకోర్టు,అసెంబ్లీ,రాష్ట్ర సచివాలయం,సియం క్యాంపు కార్యాలయం సహా ఇతర ముఖ్య భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని సిఎస్ అధికారులను ఆదేశించారు.పోలీస్ శాఖ తరపున తీసుకోవాల్సిన బందోబస్తు ఏర్పాట్లు,ట్రాఫిక్ నియంత్రణ,పార్కింగ్ వంటి ఏర్పాట్లపై సూచనలు జారీ చేశారు.అంతేగాక సెరిమోనియల్ పెరేడ్ కు తగిన అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేయాలని చెప్పారు.సిఆర్డిఏ ద్వారా వేడుకల ప్రాంగణం లెవెలింగ్,క్లీనింగ్ సహా అన్ని విధాలా సర్వాంగ సిధ్దంగా తీర్చిద్దాలన్నారు.ఉద్యానవన శాఖ వేడుకల ప్రవేశద్వారాన్ని పూలతో సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దడంతో పాటు ప్రవేశ మార్గానికి ఇరువైపుల పూలకుండీలు ఏర్పాటు చేసి అందగా తీర్చిదిద్దాలని సూచించారు.సమాచారశాఖ ద్వారా ముఖ్య అతిధి వారి గణతంత్ర దినోత్సవ సందేశం ప్రచురణ,సరిపడిన ప్రతులు సిద్ధం చేసి అందరికీ పంపిణీ చేసే ఏర్పాట్లు చేయాలన్నారు.పటిష్టమైన పబ్లిక్ అడ్రస్ సిష్టం,మీడియా లైవ్ కవరేజికి చర్యలు తీసుకోవాలన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు వీలుగా వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని ఆయా శాఖల వారీ శకటాల ఏర్పాటు ప్రదర్శనకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ శాఖ నిరంతరం విద్యుత్ సరఫరాకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.వైద్య ఆరోగ్యశాఖ వేడుకల ప్రాంగణంలో అత్యవసర వైద్య బృందాలను,అంబులెన్సులను అందుబాటులో ఉంచాలన్నారు.మొత్తం ఏర్పాట్లన్నిటినీ గుంటూరు జిల్లా కలక్టర్ వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని పర్యవేక్షించాలని చెప్పారు.ఇంకా సంబంధిత శాఖల పరంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులకు సిఎస్ విజయానంద్ సూచనలు జారీ చేశారు.
అంతకు ముందు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామల రావు వివిధ శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. శకటాలకు సంబంధించి ఈనెల 8వతేది గురువారం నాటికి ధీమ్స్ ను సింద్ధం చేసి పంపాలని చెప్పారు.
ఈసమావేశంలో సిఆర్డిఏ కమీషనర్ కె.కన్నబాబు,ఐఅండ్పిఆర్ డైరెక్టర్ కెఎస్. విశ్వనాధన్,ఆర్టీజిఎస్ సిఇఓ ప్రఖర్ జైన్,గుంటూలు జిల్లా కలక్టర్ ఎ తమీమ్ అన్సారియ, గుంటూరు జిలా ఎస్పి వకుల్ జిందాల్,అటవీ దళాధిపతి డా.పివి చలపతి రావు,ప్రోటోకాల్ అదనపు డైరెక్టర్ మోహన్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు.అలాగే వర్చువల్ గా ఎంఏయుడి ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్,అదనపు డిజిపి శాంతి భద్రతలు మదుసూధన్ రెడ్డి,వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరవ్ గౌర్,ఆశాఖ కమీషనర్ జి.వీరపాండ్యన్,ఆర్అండ్బి, ట్రాన్సుకో,ఉద్యానవన,అగ్నిమాపక,ఆర్మీ,ఎన్సిసి తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *