అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని ప్రతి పౌరునికి 2047 నాటికి బీమా సౌకర్యాన్ని కల్పించే లక్ష్యంతో భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి సంస్థ(IRDAI) పనిచేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పేర్కొన్నారు.బుధవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర స్థాయి ఇన్సూరెన్సు కమిటీ(SLIC)సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది.ఈసమావేశంలో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు బీమా కవరేజీని విస్తరించడానికి దాని ప్రయోజనాలను సామాన్యులకు చేరేలా చేయడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై కమిటీ చర్చించింది.అదే విధంగా జీవిత బీమా,పంటల బీమా,మోటారు మరియు ఆరోగ్య బీమాకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి రంగ-నిర్దిష్ట ఉప-కమిటీలను ఏర్పాటు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది.ఈ లక్ష్యాన్ని సాధించడానికి లీడ్ బీమా సంస్థలు మొదటి విడతలో సుమారు 5,000 గ్రామ పంచాయతీలను దత్తత తీసుకున్నాయి.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి దేశంలోని ప్రతి పౌరునికి బీమా సౌకర్యాన్ని కల్పించాలన్న ఐఆర్డిఎఐ లక్ష్యానికి అనుగుణంగా సెర్ప్,మెప్మా,స్వర్ణ గ్రామ,వార్డు విభాగాలతో పాటు కార్మిక,రవాణా,ఎంఎస్ఎంఇ తదితర శాఖలు వారి పరిధిలోని వారందరికీ బీమా సౌకర్యం కల్పించే విధంగా వారిలో అవగాహన కల్పించాలని చెప్పారు.రాష్ట్ర,జిల్లా స్థాయి అధికారులతో దీనిపై పలు సమావేశాలు ఏర్పాటు చేసి వారిలో తగిన అవగాహన కల్పిచి వారి సహకారంతో ఈకార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ విజయానంద్ కమిటీకి సూచించారు.
బీమా ఆవశ్యకతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిచేందుంకు అన్ని శాఖల కార్యదర్శులకు,జిల్లా కలక్టర్లకు వెంటనే తగిన ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర స్థాయిలో ఈకార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నఆర్ధికశాఖ అధికారులను సిఎస్ ఆదేశించారు.అంతేగాక వివిధ విభాగాలు రాష్ట్ర స్థాయి నుండి క్షేత్రస్థాయి వరకూ ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ విజయానంద్ అన్నిశాఖల అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర స్థాయి బీమా కమిటీ నియంత్రణ సంస్థ (IRDAI),రాష్ట్ర ప్రభుత్వం మరియు బీమా కంపెనీలతో కూడిన త్రైపాక్షిక సంస్థాగత యంత్రాంగంగా ఏర్పాటు చేయబడింది.బ్యాంకింగ్ రంగంలో ఎస్ఎల్బిసి పాత్ర మాదిరిగానే బీమా రంగంలో అత్యున్నత ప్రమాణాన్ని ఏర్పాటు చేయడం దీని లక్ష్యం.ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా బీమా కవరేజీని అంచనా వేసి ఐఆర్డిఎఐ”2047 నాటికి అందరికీ భీమా”అనే లక్ష్య స్థాధనకు అనుగుణంగా బీమా వ్యాప్తిని మరింతగా పెంచే చర్యలను సిఫార్సు చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐఆర్డిఎఐ నియమించిన మూడు ప్రధాన బీమా సంస్థల్లో PNB MetLife,స్టార్ హెల్త్ మరియు యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు బీమాపై అవగాహనను పెంచడానికి మరియు బీమా ఉత్పత్తులను అందుబాటులోకి తేవటం వంటి చర్యలకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి.జీవిత బీమా,పంట బీమా, మోటారు మరియు ఆరోగ్య బీమాకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి రంగ-నిర్దిష్ట ఉప-కమిటీలను ఏర్పాటు చేయాలని ఈకమిటీ సిఫార్సు చేసింది.గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించడానికి మరియు స్థానిక అవసరాలకు అనుగుణంగా వినూత్న బీమా ఉత్పత్తులను రూపొందించడానికి లీడ్ బీమా సంస్థలు ఇతర బీమా కంపెనీలతో కలసి పని చేస్తాయి.
ఈసమావేశంలో ఆర్ధికశాఖ ఉప కార్యదర్శి సూరజ్ ధనంజయ్,ఐఆర్డిఎఐ డిజిఎం పార్ధ సారధి,యూనివర్సల్ సాంపూ నీకాస్ డేకా హెడ్ ఎస్.రాజేశ్,ఎస్ఎంఇ ఇన్సూరెన్స్ ఇన్లూక్లూజన్ మరియు స్టార్ హెల్తు కెబిబి శ్రీనివాస్ బిజినెస్ హెడ్ మరియు సాగర్ పాల,పిఎన్బి మెట్లైప్ సిద్ధార్ధ్ మరియు శ్రీనివాసరావు క్లస్టర్ మేనేజర్,ఎస్ఎల్బిసి చీఫ్ మేనేజర్ జి.లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.అదే విధంగా వర్చువల్ గా రాష్ట్ర సర్వీసెస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్,రాష్ట్ర ఎంఏయుడి ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్,సిఇఓ ఎంఎస్ఎంఇ విశ్వ తదితరి అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News