గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సరస్ మేళాలో విధులు కేటాయించబడిన జిఎంసి సిబ్బంది, అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, మేళా పరిసర ప్రాంతాల్లో అనధికార ఆక్రమణలు, షాప్ లను తక్షణం తొలగించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. ఆదివారం స్థానిక నల్లపాడు రోడ్ లో జరుగుతున్న సరస్ మేళాని పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ సరస్ మేళాలో ఫుడ్ స్టాల్, త్రాగునీటి పాయింట్స్, పారిశుధ్య పనులు, మొబైల్ టాయ్ లెట్స్ ని పరిశీలించి, అధికారులతో మాట్లాడుతూ ప్రస్తుతం సంక్రాంతి సెలవులు ప్రారంభమైనందున మేళాకు ప్రజలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రతి స్టాల్ ఎదుట ఏర్పాటు చేసిన డస్ట్ బిన్లలోనే వ్యర్ధాలు వేసేలా, వెంటనే తొలగించేలా ప్రజారోగ్య అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. ఇప్పటికే షిఫ్ట్ ల వారీగా అన్ని విభాగాల అధికారులకు విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చినందున అందుకు తగిన విధంగా ఎప్పటికప్పుడు విభాగాధిపతులు, డిప్యూటీ కమిషనర్లు పర్యవేక్షణ చేయాలన్నారు. పర్యటనలో సిఎంఓహెచ్ డాక్టర్ శశికళ, ఆర్ఓ మదన్ గోపాల్, ఎస్ఎస్ లు, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News