విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని 13 జిల్లాలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 33 విత్తనశుద్ధి మరియు విత్తనాలను నిల్వ చేసేందుకు గోదాములను మంజూరు చేయడం జరిగింది. వాటికి సంబంధించి జిల్లాల వారీగా ఏ విధంగా పనులు జరుగుచున్నవి అనే అంశంపై ఈరోజు రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది.
చైర్ పర్సన్ పేర్నాటి హేమ సుస్మిత మాట్లాడుతూ మన సంస్థకు సంబంధించి రైతులకు ఖరీఫ్, రబీ సీజన్లలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యమైన విత్తనాలను మన సంస్థ ద్వారా ఇచ్చి ముందుకు నడిపించాల్సిన బాధ్యత మన అందరిమీద ఉందని తెలియజేయడం జరిగింది. అదే విధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా మన సంస్థకు సొంత భవనాలు ఉంటే బాగుంటుందని ఈ సమావేశంలో చర్చించడం జరిగింది.
శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయానికి ముఖ్యమంత్రి పెద్దపీట వేయాలని ఆలోచనతో ఉన్నారు కాబట్టి, మన విత్తనాభివృద్ధి సంస్థ పూర్తి బాధ్యత తీసుకొని, రైతులను చైతన్యపరిచి, మన రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా రాబోయే రోజుల్లో సేంద్రియ వ్యవసాయానికి పెద్ద పీట వేద్దాం అని, ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం “సీడ్ ప్రొడక్షన్ విలేజెస్” అనే పేరుతో దాదాపుగా 1000 గ్రామాలను గుర్తించి, రైతులకు MSP (మినిమమ్ సెల్లింగ్ ప్రైస్) ఏర్పాటు చేసి, రైతులు ఎక్కడ కూడా నష్ట పోకుండా విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా ముందుకు నడిపిస్తామని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో 33 ప్రాసెసింగ్ యూనిట్లే కాకుండా ఇంకొన్ని విత్తన నిల్వ మరియు శుద్ధి కర్మాగారాలు కావాలని ఈ సమావేశంలో కోరడం జరిగింది.
ఈ సమావేశంలో ఉన్నతాధికారులు, మార్కెటింగ్ మేనేజర్, ఫైనాన్స్ మేనేజర్, ఇంజినీరింగ్ విభాగం, అకౌంట్స్ మేనేజర్, అన్ని జిల్లాల డిస్ట్రిక్ట్ మేనేజర్ లో పాల్గొనడం జరిగింది.