విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ‘డోర్ టు డోర్ మెగా వ్యాక్సినేషన్’లో భాగంగా సోమవారం 197 సచివాలయం పరిధిలోని 27వ డివిజన్‌లోని బావాజీపేటలో ఇంటింటికి వెళ్ళడంతోపాటు, మహాలక్ష్మీ దేవాలయం దగ్గర ఏర్పాటు చేసిన ‘డోర్ టు డోర్ మెగావేక్సిన్’ కార్యక్రమంలో సుమారు 250 మందికి కోవాక్సిన్, కోవిషీల్డ్ మొదటి, రెండవ విడత వాక్సిన్ వేశారు. 18 సంవత్సరాలు దాటి వారికి వాక్సిన్ వేశారు. ప్రభుత్వం, కలెక్టర్ జె.నివాస్, సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు, నగరపాలక సంస్థ కమీషనర్ ప్రసన్న వెంకటేష్, స్థానిక కార్పోరేటర్ మల్లేశ్వరీ బలరామ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఆరోగ్య సిబ్బంది సిబ్బంది ప్రతి గడపకు వెళ్ళి వాక్సిన్ ఇంకా ఎవరైనా వేయించుకోవలసిన వారికి అవగాహన కల్పించి టీకా వేయిస్తూ ఎవరికైనా అనారోగ్యం ఉన్నవారు వివరాలు తెలుసుకుంటూ డివిజన్‌లోని బావాజీపేటలో పర్యటించారు. అలాగే సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫివర్‌పై జాగ్రత్తలు తెలియజేస్తూ, పరిసరాల పరిశుభ్రతను వివరించారు. ఈ డోర్ టు డోర్ మెగా వ్యాక్సినేషన్‌లో 197, 198, 199, 200 సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఆశావర్కర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, ఉమెన్ ప్రొటెక్షన్ సిబ్బంది, నగర పాలక సంస్థ సిబ్బంది, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
విస్తృత ప్రజాప్రయోజన పనులపై ప్రత్యేక దృష్టిపెట్టండి
– రైల్వేతో ముడిపడిన అంశాల్లో పురోగతిపై నిరంతర సమీక్ష – ఉమ్మడి తనిఖీల ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయండి – డీపీఆర్‌లు, …