Breaking News

రాష్ట్ర మెడికల్ కౌన్సెల్ ద్వారా ఏఐ ఆధారిత వాట్సప్ సేవలను ప్రారంభించిన మంత్రి సత్యకుమార్

-వీడియోల ద్వారా కూడా తెలుసుకునే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి (ఏపీ మెడికల్ కౌన్సెల్) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానంలో సేవలకు శ్రీకారంచుట్టింది. వైద్యుల రిజిస్ట్రేషన్లు, రెన్యువల్స్, ఇతర సేవల సమాచారం కోసం విజయవాడలోని కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఫోన్లు చేయాల్సిన అవరం లేకుండా వాట్సప్ నెంబరు 9030999616 ద్వారా పూర్తి సమాచారాన్ని ఏఐ ద్వారా తెలుసుకునే సదుపాయాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. వైద్య మండలి అధ్యక్షుడు డాక్టర్ శ్రీహరిరావు, ఉపాధ్యక్షురాలు సుజాత, వైద్యులైన సభ్యులు కేవీ సుబ్బనాయుడు, కేశవరావుబాబు, ఎస్.సురేష్ బాబు, సీనియర్ అధికారి సత్యప్రసాద్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ డి శ్రీనివాసులరెడ్డి, ఇతరులు పాల్గొన్న ఈ కార్యక్రమం రాష్ట్ర సచివాలయంలోని మంత్రి చాంబర్లో జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ దగ్గుమాటి శ్రీహరిరావు మాట్లాడుతూ మెడికల్ కౌన్సెల్లో 1.3 లక్షల మంది వైద్యులకు సభ్యత్వం ఉన్నట్లు చెప్పారు. కౌన్సెల్ కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో రెన్యువల్స్ విధానాన్ని చేపట్టామన్నారు. వైద్యులకు క్రెడిటు పాయింట్లు కూడా తగ్గించామన్నారు. తమ సేవలను సభ్యులైన వైద్యులకు మరింత చేరువ చేసేందుకు వీలుగా ఏఐ ఆధారిత చాట్ బాట్ ను ప్రారంభించమన్నారు. వాట్సప్ నెంబరు ద్వారా వీడియో రూపంలో, సంక్షిప్త సందేశo రూపంలో తాము అందించే పది రకాల సేవల సమాచారాన్ని సందేహాలను నివృత్తిచేసే విధంగా చాట్ బాట్ రూపొందించినట్లు తెలిపారు. కొత్తగా వైద్యులు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ఆధారపత్రాలు ఏమేమి కావాలి? రెన్యువల్, క్రెడిటు పాయింట్లు, స్లాటు బుకింగ్ కోసం ఏ విధంగా కౌన్సెల్ను సంప్రదించాలన్న దానిపై ప్రశ్నలు-జవాబుల రూపంలో సమాచారాన్ని చాట్ బాట్ రూపంలో అందుబాటులో పెట్టినట్లు ఉపాధ్యక్షులు సుజాత, సభ్యులు కేశవరావుబాబు, సుబ్బనాయుడు తెలిపారు నెంబరు లేకున్నా వాట్సప్ లోని క్యూఆర్ కోడ్ ద్వారా కూడా కౌన్సెల్ సమాచారాన్ని పొందవచ్చునన్నారు. దీనివల్ల విలువైన సమయం వృథా కాకుండా ఉంటుందని, విశ్వసనీయ సమాచారం అందుబాటులో ఉంటుందని, 24 గంటలపాటు చాటుబాటు సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

కార్యాలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి।

విజయవాడ నగరంలో ఉన్న సొంత స్థలంలో కౌన్సెల్ కార్యాలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని మెడికల్ కౌన్సెల్ సభ్యులు మంత్రి శ్రీ సత్యకుమార్ ను కోరారు. నిర్మాణానికి అవసరమైన నిధులను కౌన్సెల్ తరపున ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని సభ్యులు చెప్పగా పరిశీలిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *