-విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటివరకు 28 వేల మొక్కలను పంపిణీ చేశామని డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబునాయుడు శంకల్పిస్తున్న హరిత ఆంధ్ర ప్రదేశ్ లో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ చేస్తున్న ఉచిత పండ్ల మరియు పూల మొక్కల పంపిణీ కార్యక్రమంలో ఇప్పటివరకు 28 వేల మొక్కలను పంపిణీ చేశామని అన్నారు. అందులో మామిడి 6000, జామ 6000, నిమ్మ 6000 మరియు నూరువరహాలు 10,000 పంపిణీ చేశామని, సంక్రాంతి పండుగ తర్వాత గులాబీ మరియు మందార మొక్కలను కూడా ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు. ఉచిత పండ్ల మరియు పూల మొక్కల పంపిణీ కార్యక్రమం ద్వారా నగర కాలుష్యాన్ని తగ్గించే దిశగా విజయవాడ నగరపాలక సంస్థ పని చేస్తుందని ప్రజలందరూ దీనిలో భారీగా పాల్గొని వారు కూడా కాలుష్యాన్ని తగ్గించే ఈ కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని అన్నారు.
Prajavartha Online Telugu News